కేసీఆర్ తనిఖీల్లేవ్..పర్యటన మాత్రమే..!

కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేదానికి.. చేసేదానికి వేరేలా ఉంటుంది. ఆయన వేసే వ్యూహం కేటీఆర్ కూడా తెలియకపోవడం విశేషం. అంతటి రాజకీయ నాలెడ్జ్ ఉన్న కేసీఆర్ గురించి తెలుసుకోవడం చాలా కష్టమే. అయితే ఇటీవల కేసీఆర్ చేసిన పర్యటనలో ఆయన మార్క్ మరోసారి కనిపించింది. ముందుగా ఆయన ప్రభుత్వ కార్యాలయాలన్నీంటిని ఆకస్మికంగా తనిఖీ చేస్తారని ప్రచారం చేశారు. అయితే అలాంటిదేమీ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన పర్యటనంతా ప్రసంగానికే పరిమితం కావడంతో నాయకుల్లోనూ ఆశ్చర్యం […]

Written By: NARESH, Updated On : June 21, 2021 12:27 pm
Follow us on

కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేదానికి.. చేసేదానికి వేరేలా ఉంటుంది. ఆయన వేసే వ్యూహం కేటీఆర్ కూడా తెలియకపోవడం విశేషం. అంతటి రాజకీయ నాలెడ్జ్ ఉన్న కేసీఆర్ గురించి తెలుసుకోవడం చాలా కష్టమే. అయితే ఇటీవల కేసీఆర్ చేసిన పర్యటనలో ఆయన మార్క్ మరోసారి కనిపించింది. ముందుగా ఆయన ప్రభుత్వ కార్యాలయాలన్నీంటిని ఆకస్మికంగా తనిఖీ చేస్తారని ప్రచారం చేశారు. అయితే అలాంటిదేమీ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన పర్యటనంతా ప్రసంగానికే పరిమితం కావడంతో నాయకుల్లోనూ ఆశ్చర్యం వేస్తోందటున్నారు.

తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ 10 జిల్లాలను 33 జిల్లాలకు పెంచారు. ఆయా జిల్లాల్లో సౌకర్యాలను కల్పించేందుకు నిధులను విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతీ జిల్లాల్లో కలెక్టరేట్లు, పోలీస్ స్టేషన్లు నిర్మించేందుకు భారీగా నిధులను కేటాయించారు. ఇప్పటి వరకు కలెక్టరేట్లు పూర్తయిన భవనాలను ప్రారంభించేందుకు కేసీఆర్ పర్యటనను మొదలు పెట్టారు. వాస్తవానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ ఆధికారికంగా అన్ని జిల్లాల్లో పర్యటించలేదు. కేవలం ప్రచారం కోసమే వెళ్లారు.

తాజాగా ఆయన సిద్ధిపేట, కామరెడ్డి జిల్లాల్లో పర్యటించారు. అయితే ముందుగా ఆయన కలెక్టర్ కార్యాలయాలను ప్రారంభించి ఆ తరువాత ఆసుపత్రుల్లో, కార్యాలయాల్లో విధులపై ఆకస్మికంగా తనిఖీ చేస్తారని ప్రచారం చేశారు. దీంతో ఈ జిల్లాల్లోని అధికారులు ఆందోళనకు గురయ్యారు. కొన్ని జిల్లాల్లో సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి తనిఖీ చేస్తాననడంతో వారిలో భయం పుట్టుకుంది.

అయితే కేసీఆర్ సిద్ధిపేట కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించి ఆ తరువాత ప్రసంగించారు. ఆ తరువాత కామరెడ్డి జిల్లాకు వెళ్లారు. అక్కడ కూడా కలెక్టర్ భవనం ప్రారంభం తరువాత ప్రసంగానికే పరిమితమయ్యారు. మొత్తం మూడు గంటల పర్యటనల్లో గంటన్నర ప్రసంగాలలకే సమయం గడిచిపోయింది. దీంతో కార్యాయాల్లో తనిఖీ కార్యక్రమం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొందరు కేసీఆర్ పర్యటనకు ముందే తనిఖీలు ఉండవని సంకేతాలు పంపారని భావిస్తున్నారు. ఏదీ ఏమైనా కేసీఆర్ పర్యటన భవనాలను ప్రారంభించడానికేనని అంటున్నారు.