
సినిమాకి బడ్జెట్ పెరిగితే.. దర్శక నిర్మాతలు వెంటనే రెండు పార్ట్స్ అంటూ హడావుడి చేస్తున్నారు. ఈ రెండు భాగాల ట్రెండ్ బాహుబలితో ఫామ్ లోకి వచ్చింది. ఇప్పుడు ఇది టాలీవుడ్ లో సర్వసాధారణం అయిపోయింది. ఒక సినిమాకు రెండు భాగాలు అంటే.. రెండు సినిమాలకు వచ్చే అంత డబ్బు వచ్చినట్టే. నిజానికి బాహుబలి రెండు భాగాలుగా రావడం వల్లే, వందల కోట్లు లాభాలను గడించింది.
ఇక కేజీఎఫ్ తొలి భాగం సూపర్ హిట్ అయి కోట్లు కుమ్మరించింది. రానున్న చాప్టర్ 2 పూర్తిగా లాభమే. అందుకే బన్నీ ఎక్కువ ఆలోచించకుండా పుష్షను పార్ట్ 1, పార్ట్ 2గా మార్చేసి.. బడ్జెట్ పై నిర్మాతలకు భరోసా ఇచ్చాడు. ఇప్పుడు సలార్‌దీ అదే పరిస్థితిలా కనిపిస్తోంది. పైగా ప్రభాస్ హీరో, బాహుబలి హీరో అంటూ నేషనల్ వైడ్ గా ఫుల్ ఫాలోయింగ్ ఉంది.
అన్నిటికి మించి ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను క్యాష్ చేసుకోవాలని సలార్ నిర్మాతలు కూడా కేజీఎఫ్ లానే .. సలార్ ని కూడా రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట, ప్రస్తుతం ఇదే విషయం పై ప్రభాస్ – ప్రశాంత్ నీల్ మధ్య చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది.
ఒకవేళ ప్రభాస్ ఒప్పుకుంటే సలార్ కూడా రెండు సార్లు బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం. ఏది ఏమైనా బిజినెస్ పరంగా కూడా భారీ లాభాలను ఆర్జించడంలో ప్రశాంత్ నీల్, రాజమౌళికి తమ్ముడు లాంటి వాడు. పైగా కేజీఎఫ్ లో కూడా ఈ స్కీమ్ వర్కౌట్ అయింది కూడా. కాకపోతే సలార్ ప్రారంభించే ముందు స్క్రిప్ట్ ను ఒక పార్ట్ కి అనుకునే రాసుకున్నారు. మరి మధ్యలో స్క్రిప్ట్ మారిస్తే.. అసలుకే మోసం వస్తోందేమో.