కరోనా మహమ్మారి పుట్టి ఏడాది దాటింది. అయితే మొదటి వేవ్, సెకండ్ వేవ్ అంటూ ప్రజల ప్రాణాలు తీస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాలు ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ వేళ కూడా కంటికి కనిపించని వైరస్ కు ఇంత మంది బలి కావాల్సి వస్తోంది. ఎన్నో అల్లోపతి మందులు, కరోనా వ్యాక్సిన్లు, రెమెడిసివిర్ ఇంజక్షన్లు చేయలేని పనిని ఆయుర్వేదం చేస్తోంది. మన పురాతన ఆయుర్వేదంలో ఎంతో శక్తి ఉంది. కనుమరుగైన ఆ శక్తిని సరిగ్గా వాడుకుంటే కరోనాకు చెక్ పెట్టవచ్చని నిరూపించారు నెల్లూరుకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఒకరు.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనాకు ఇస్తున్న ఆయుర్వేద మందు ఎంతోమందికి కరోనా నయం చేస్తోంది. పూర్తి ఉచితంగా ఇస్తున్న ఈ మందుతో కరోనాను జయించామని చాలా మంది చెప్పడంతో అది వైరల్ అయ్యింది. దీంతో ఈరోజు 60వేల మంది ఆ గ్రామాన్ని సందర్శించారు. అంతేకాదు.. జగన్ సర్కార్ ఈ మందుకు ఆమోదముద్ర వేసి దీనిపై పరిశోధన చేయాలని భారత వైద్య పరిశోధన మండలిని కోరడం సంచలనమైంది.
దీంతో కరోనాను నెల్లూరు ఆయుర్వేద వైద్యుడు ఇస్తున్న ఆ మెడిసిన్ లో ఏముంది? అధికారులు పరిశోధన చేసేలా ఏం మందు ఆ వైద్యుడు ఇస్తున్నాడన్నది ఆసక్తిగా మారింది.
నెల్లూరుకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ‘అడ్డసరం, తిప్పతీగ, ఉసిరి, జిల్లేడు’ లాంటి ప్రకృతి వనమూలికలతో ఆయుర్వేద మందును తయారు చేస్తున్నారు. ఈ మందుతో కరోనా రోగులు పూర్తిగా కోలుకుంటున్నారని.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు ఉండవని చెబుతున్నారు. ఈ మందు వాడిన తర్వాత త్వరగానే కోలుకున్నామని కరోనా రోగులు వెల్లడిస్తున్నారు. దీంతో ప్రజలు తండోపతండాలు వస్తున్నారు.
మన భారతీయత మూలాలు అంతా ఆయుర్వేదంతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడున్న అల్లోపతి మందుల కంటేముందే మన రుషులు, యోగిలు ఆయుర్వేద మందులను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఎన్నో రోగాలను నయం చేసే ఔషధ మూలికలు, ఆయుర్వేద సంగతులు మన పురాతన గ్రంథాల్లో ఉన్నాయి. మన పెరటిలో దొరికే తులసి, వేపాకు, మామిడి, అశ్వగంధ, విప్పతీగ, నేలవాము, నేరేడు, మారేడు, అరటి వేళ్లు, అలోవిరా వంటి మొక్కలతో ఎన్నోరకాల వ్యాధులను మన ఆయుర్వేద నిపుణులు నయం చేస్తున్నారు.
ఇక కరోనాను నియంత్రించడంలో అడ్డసరం అనే మొక్క అద్భుతంగా పనిచేస్తోందని ఢిల్లీలోని ఆయుర్వేద, రెస్బిరేటరీ రీసెర్చ్ జీనోమిమ్స్, ఐజీఐబీ వంటి సంస్థల పరిశోధనలో తేలింది. ఈ మొక్క కరోనా నివారణ విషయంలో సానుకూల ఫలితాలు ఇవ్వడంతో ఆశలను రేకెత్తించింది.
మన ఆయుర్వేదంలోని అడ్డసరం మొక్క కరోనా దెబ్బతీసే అవయవాలపై పనిచేస్తుంది. కరోనా వైరస్ వచ్చిన రోగిలోని రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి. అందులోనూ రక్తం గడ్డ కట్టడం, ఊపిరితిత్తులోని కణజాలం దెబ్బతినడంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ మూడు వ్యవస్థలను మెరుగుపర్చడంలో అడ్డసరం మొక్క బాగా ప్రయోజనకారిగా పరిశోధనల్లో తేలింది. దీన్నే నెల్లూరు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఉపయోగిస్తున్నాడు.వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి అడ్డసరం మొక్క ఉపయోగపడుతుందని పరిశోధనల్లో తేలింది. ఈ అధ్యయనం పత్రం తాజాగా రెస్బిరేటరీ రీసెర్చ్ పబ్లికేషన్ లోనూ రావడం విశేషం. కరోనా వ్యాక్సిన్ చేయలేని పని ఈ అడ్డసరం మొక్క చేస్తుందంటున్నారు.
మన ఆయుర్వేద వైద్యులు అడ్డసరం మొక్క మందుల తయారీలో వాడుతారు. దీని ఆకులు, పుష్పాలు, వేర్లు, బెరుడును మందుల తయారీలో విరివిగా వాడుతున్నారు. దీంతోనే జలుబు, దగ్గు, ఉబ్బసం, రక్తస్రావం నివారణ, చర్మ వ్యాధుల చికిత్సలో వాడుతున్నారు.
ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం ద్వారా అయుర్వేదం కరోనాను తగ్గిస్తోందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఇప్పటికే చాలా మంది ఆయుర్వేద మందులతో తెలుగు రాష్ట్రాల్లో కరోనాను జయించేలా చేస్తున్నారు. ఇప్పటికే అశ్వగంధి, విప్పతీగ వంటి వనమూలికలతో తయారు చేసిన ఆయుర్వేద వాడటం ద్వారా కరోనాను జయించవచ్చని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ప్రకటించారు. ఆ మందును మార్కెట్లోకి విడుదల చేశారు. అదిప్పుడు ఇమ్యూనిటీ బూస్ట్ గా మారింది. కరోనా నియంత్రణకు ఆయుర్వేదాన్ని విరివిగా వాడుతున్నారు.
కరోనా రాకముందు అన్ని అత్యాధునిక ప్రాడక్ట్ లు వాడేవాళ్లంతా కూడా మన సంప్రదాయ పద్దతులకు మారడం విశేషం. ఎక్కువ మంది మన పురాతన ఆవిరిపడుతున్నారు. ఫ్రిజ్ వాటర్ తాగేవాళ్లు అంతా వేడి నీళ్లు తాగుతున్నారు.పసుపు, తేనే, నిమ్మరసం కలిపి తాగుతున్నారు. అవి ఇమ్యూనిటీ బూస్టర్లుగా నమ్ముతున్నారు.
ఇమ్యూనిటీని పెంచుకోవడంలో కరోనా వైరస్ ను అంతం చేయడంలో ‘అమృతధార ఆయుర్వేద’ మందు బాగా పనిచేస్తోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం ఇప్పటికే ప్రకటించింది. ఈ మందు వాడకం ద్వారా వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతోందని తేలింది.
మన ఆయుర్వేదంలో విరివిగా వాడే ఔషధ మూలికలతో శక్తినిచ్చే ఆయుర్వేద పదార్థాలు ఇప్పుడు మార్కెట్లో విరివిగా అమ్ముడవుతున్నాయి.
సంప్రదాయ ఆయుర్వేద వైద్యానికి దేశంలోనే కేరళ ఫేమస్. ఆ రాష్ట్రంలో ఇప్పటికీ చాలా మంది ఆయుర్వేదం వైపే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అందుకే అక్కడ మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉంటోంది. కరోనా నివారణకు కేరళ వాసులు పెరిటి వైద్యాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. టీకాల కంటే ఆయుర్వేదంపైనే ఎక్కువగా దృష్టి పెడితే ఇలాంటి ఎన్ని కరోనాలు వచ్చినా భారతీయులను ఏం చేయలేవు.కానీ మన మూలాలు మరిచి అల్లోపతి మందులు మింగుతూ సైడ్ ఎఫెక్ట్ లతో ప్రాణాలు తీసుకుంటున్నాం. ‘7 సెన్స్ ’ సినిమాలో ఇప్పటికే ఇలాంటి వైరస్ లపై మన ఆయుర్వేదం ఎలా పనిచేస్తుందో నిరూపించారు. అందుకే ఆయుర్వేదం ఉన్న అద్భుత సారాన్ని తెలుసుకొని ప్రజలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫలితంగా ఇలాంటి మహమ్మారులను నుంచి ప్రజలను కాపాడినవారం అవుతాం.