నిజామాబాద్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌ ప్రారంభం..

ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక శుక్రవారం ప్రారంభమైంది. జిల్లాలోని 50 పోలింగ్‌ స్టేషన్లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 824 మంది ఓటర్లున్నారు. 483 మంది జిల్లా ఓటర్లు కాగా, 341 మంది కామారెడ్డి జిల్లావారు ఉన్నారు. Also Read: దుబ్బాకలో హరీష్ రావు రెండుకళ్ల సిద్ధాంతం.. ఫలిస్తుందా? అత్యధికంగా నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో 67ఓట్లు ఉండగా, చందూర్‌లో నలుగురు మాత్రమే ఓటు హక్కు […]

Written By: NARESH, Updated On : October 9, 2020 10:16 am
Follow us on

ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక శుక్రవారం ప్రారంభమైంది. జిల్లాలోని 50 పోలింగ్‌ స్టేషన్లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 824 మంది ఓటర్లున్నారు. 483 మంది జిల్లా ఓటర్లు కాగా, 341 మంది కామారెడ్డి జిల్లావారు ఉన్నారు.

Also Read: దుబ్బాకలో హరీష్ రావు రెండుకళ్ల సిద్ధాంతం.. ఫలిస్తుందా?

అత్యధికంగా నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో 67ఓట్లు ఉండగా, చందూర్‌లో నలుగురు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుకోనున్నారు. పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌క్యాస్టింగ్‌, 14 సమస్యాత్మక ప్రాంతాల్లో వీడియో షూటింగ్‌తో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల విధుల్లో 399 మంది పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్‌ నుంచి కల్వకుంట్ల కవిత బరిలో ఉన్నారు. గతంలో నిజామాబాద్‌ ఎంపీగా ఉన్న కవిత 2018 ఎన్నికల్లో ఓటమి చెందారు. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్సీ స్థానంలో బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. మొత్తం ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. ఇద్దరు అభ్యర్థులు శ్రీనివాస్‌, భాస్కర్‌లవి తిరస్కరించారు. లోయపల్లి నర్సింగ్‌రావు, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు.

2015లో నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ నుంచి భూపతిరెడ్డి ఎన్నికయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి రాకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీఆర్‌ఎస్‌ నేతలు మంత్రి మండలి చైర్మన్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూపతిరెడ్డిపై 2019 జనవరి 16న అనర్హత వేటు విధించారు. అప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది.

Also Read: తెలంగాణలోని మినీ ఇండియా గ్రామం గురించి మీకు తెలుసా..?

కరోనా పాజిటివ్‌ కారణంగా 24 మంది ఓటు వేసే అవకాశం లేదు. దీంతో వారికి చివరి గంటలో ఓటువేసే అవకాశం కల్పించారు. కరోనా బాధితుల కోసం పీపీఈ కిట్లు, అంబులెన్స్‌లను రెడీగా ఉంచారు.