Bodhan Nizamabad: దేశంలో సామాజిక మాధ్యమాల ప్రభావంతో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఏవో పోస్టులు పెడుతూ అందరని రెచ్చగొడుతూ చోద్యం చూస్తున్నారు. అనవసర పోస్టులతో ఏదో జరుగుతోందంటూ మతోన్మాదం మాటున హింసా ఘటనలు జరుగుతున్నాయి. దీనికి కారణం మనుషుల్లో రగిలే ఆగ్రహావేశాలే. ఏ విషయాన్ని అయినా సునిశితంగా పరిశీలించి దాని మీద ఓ నిర్ణయానికి రావాలి కానీ సోషల్ మీడియాలో ఏదో చూస్తూ ఏదో జరిగిపోతోందంటూ హంగామా చేస్తూ ఎదుటి వారికి బాధలు కలిగించడం మానవ నైజం కాదు.
ఇటీవల నిజామాబాద్ జిల్లా బోధన్ లో చోటుచేసుకున్న సంఘటన దీనికి చక్కని తార్కాణం. శివాజీ విగ్రహావిష్కరణ సందర్భంగా చోటుచేసుకున్న గొడవలో ఎంతో మందికి గాయాలు కావడం తెలిసిందే. ఎందుకంత పిచ్చి. ఎందుకు ఇంత దారుణం. మనిషిలోని రాక్షసత్వాన్ని ప్రదర్శించడం ఎంతవరకు సమంజసం. ఈ గొడవకు కారణమైన 12 మందిని అరెస్టు చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చినా జంతు సంస్కృతి అక్కడ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
Also Read: Junior NTR- TDP: జూనియర్ ఎన్టీఆర్ తోనే టీడీపీకి మనుగడ ఉందా?
ఇక భైంసా సంగతి వేరే చెప్పనక్కర లేదు. ఏ చిన్న గొడవనైనా సాకుగా చూపి రెచ్చిపోయి పిచ్చివారి మాదిరి కోపాలు ప్రదర్శించడం సాధారణమైపోయింది. దీంతో ఎంతో మంది నష్టపోతున్నారనే విషయం తెలియడం లేదు. ఎన్ని సంఘటనలు జరిగినా వారిలో మానవత్వం మాత్రం కనిపించడం లేదు. ఎక్కడి నుంచి శివాజీ గ్రూప్ లు పట్టణంలోకి ప్రవేశిస్తున్నాయని ఊహించుకుని అందరి మీద దాడులు చేసేందుకు సిద్ధం కావడమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.
ప్రజాస్వామ్యంలో ఉన్నామా? పరాయి పాలనలో ఉన్నామా? అనే అనుమానాలు వస్తున్నాయి. మనిషి మనిషిలా కాకుండా మృగంలా ప్రవర్తిస్తే ఇక చెప్పేదేముంటుంది. మార్చి 20 కంటే ముందే మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమాన్ని వీడియోలో పోస్టు చేస్తే దానితో మాకు ముప్పు ఉందని మరో వర్గం భావించడం ఆటవికమే. మొత్తానికి నిజామాబాద్ లో పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. ఇంతటి జుగుస్సాకరమైన ఘటనకు పాల్పడటం అత్యంత దారుణమే.
మహారాష్ట్ర నుంచి వేలాది మంది హిందువులు వస్తున్నారనే ఉద్దేశంతోనే దాడులు చేయడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ట్విటర్ లో పెట్టిన పోస్టులకు ఏదో జరుగుతుందని ఊహించి ఇలా దాడులకు తెగబడటంపై విమర్శలు వస్తున్నాయి.
Also Read: Yadadri Temple: నేడే యాదాద్రి ప్రారంభం.. తొలి దర్శనం కేసీఆర్ కే..
Recommended Video: