Paddy Row: హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత బీజేపీని టార్గెట్ చేసుకుని పోరాటం చేయాలని టీఆర్ఎస్ భావించింది. ఇందులో భాగంగా పలుమార్లు ఢిల్లీ వెళ్లి కూడా రభస సృష్టించాలని ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. ఫలితంగా టీఆర్ఎస్ కే మచ్చపడింది. దీంతో ఇటీవల కూడా ధాన్యం కొనుగోలును రాజకీయం చేయాలని చూస్తూ కేంద్రాన్ని నిందించాలని ప్రయత్నాలు చేస్తున్నా అవి కూడా ఫలించడం లేదు. దీంతో టీఆర్ఎస్ కుట్రలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఏ రాష్ట్రానికి రాని గొడవ తెలంగాణకే ఎందుకు వస్తుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తుంటే టీఆర్ఎస్ నేతలు ఏం చెప్పలేకపోతున్నారు.
తెలంగాణలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. దీన్ని అడ్డుకోవాలనే వ్యూహంలో టీఆర్ఎస్ ఎన్నో కుట్రలకు పాల్పడుతోంది. కానీ అవేవీ బీజేపీని అడ్డుకునేలా లేవని తెలుస్తోంది. అందుకే కేసీఆర్ కనుసన్నల్లోనే టీఆర్ఎస్ నేతలు పనిచేస్తున్నారు. వడ్ల విషయంలో మాత్రం టీఆర్ఎస్ అప్రదిష్టను మూట గట్టుకుంటోంది. రాబోయే ఎన్నికల్లోఇదే అంశంతో బీజేపీని రాష్ట్రంలో బలోపేతం కాకుండా చేసేందుకు టీఆర్ఎస్ కంకణం కట్టుకుంది. మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలని టీఆర్ఎస్ చూస్తోంది. దీని కోసమే బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగుతోంది.
Also Read: Bodhan Nizamabad: బోధన్ గొడవ పెద్దదవుతోందా? అక్కడ హిందూ సంఘాల మోహరింపునకు కారణమేంటి?
ఇప్పటికే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించడంతో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. త్వరలో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో కూడా తన ప్రభావం చూపించుకోవాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే తన పంజా చూపించిన బీజేపీ రాబోయే ఎన్నికలను కూడా తనకు అనుకూలంగా మలుచుకునేందుకే ప్రాధాన్యం ఇస్తోంది.
ఏప్రిల్ 14 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించాలని చూస్తున్నారు. దీని ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని ఓటర్లను కోరనున్నారు. దీనికి ప్రణాళిక ఖరారు చేసుకున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుధ్ధం ఇంకా పెరగనుందని తెలుస్తోంది. టీఆర్ఎస్ బీజేపీపై ఒంటికాలిపై లేస్తోంది. ధాన్యం విషయం అడ్డం పెట్టుకుని అవాకులు చెవాకులు పేలుతోంది. బీజేపీ నేతలు కూడా ధీటుగానే సమాధానం చెబుతున్నారు.
Also Read: Kodali Nani: మంత్రి కొడాలి నాని స్థానాన్ని భర్తీ చేసేదెవరు?
Recommended Video: