Central GST : జీఎస్టీ రేట్ల కోతపై తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. జీఎస్టీ కౌన్సిల్ లో రేట్ల హేతుబద్ధీకరణపై చర్చలకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, రేట్ల తగ్గింపు విషయంలో రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. ముందుగా ‘నేను వారిని నిందించడం లేదు. ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచుకోవాలని వారు భావిస్తున్నారు. రాష్ర్టప్రభుత్వాల స్థాయిలో వారికి ఆ అధికారం ఉంది. వారి విధులు ఒకరిని సంతోష పెట్టడం కాదు.. ప్రస్తుతం ఉన్న ఆదాయాన్ని రక్షించడం..ఈ విషయం అందరికీ తెలుసు అంటూ ఆమె ఈ సందర్భంగా విలేకరులతో వ్యాఖ్యానించారు. హేతుబద్దీకరణ చర్చల్లో భాగంగా వస్తు, సేవలపై రేట్లను పునఃసమీక్షించడానికి కొంత సమయం పడుతుందని ఆమె స్పందించారు. సెప్టెంబర్ 9న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చ ప్రారంభం కానుంది. కొన్ని నెలలుగా, అధిక జీఎస్టీ రేట్ల పై కేంద్రం విమర్శలను ఎదుర్కొంటున్నది. అయితే ఈ విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. ప్రస్తుతం అన్ని వస్తువులు, సేవల రేట్లు జూలై 2017 కంటే తక్కువగా ఉన్నాయని చెప్పారు. అనేక పన్నులు. సెస్ లను కలిపిన తరువాత కొత్త విధానం ప్రారంభమైందని తెలిపారు. ఇంతకంటే మంచి ఏముంటుందని, కేంద్రం ప్రజాకోణంలోనే పని చేస్తుందని ఈ సందర్భంగా ఆమె నొక్కి చెప్పారు.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా దుర్మార్గమైన, తప్పుడు ప్రచారం జరుగుతోంది. అలాంటి ప్రచారాలపై నేను స్పందించను. జీఎస్టీ వల్ల దేశం మొత్తం ప్రయోజనం పొందుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రేట్లతో పాటు, అన్ని రాష్ర్టాల పరిధిలో సరిహద్దు తనిఖీలను తొలగించామని, తద్వారా సరుకుల రవాణా సాఫీగా, వేగంగా సాగుతుందని ఆమె వివరించారు. ఇక 2017లో జీఎస్టీ ప్రారంభానికి ముందు నిపుణుల కమిటీ చెప్పిన ప్రకారం 15.3 శాతంతో పోలిస్తే 2019లో అంచనా వేసిన స్థాయిలో రెవెన్యూ న్యూట్రల్ రేటు ప్రస్తుతం 11.6 శాతానికి పడిపోయిందని ఆమె తెలిపారు.
రేట్ల హేతుబద్ధీకరణపై బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని మంత్రుల బృందం 5%, 12%, 18%, 28% అనే శ్లాబులను యథాతథంగా ఉంచాలని సిఫార్సు చేసింది. అయితే ఈ అభిప్రాయానికి భిన్నంగా రాష్ట్ర ఆర్థిక మంత్రులు, కేంద్రం చాలా మంచి వాతావరణంలో చర్చించనున్నామని పేర్కొన్నారు. చర్చల తర్వాత ఓ ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకుంటామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
లగ్జరీ, తదితర వస్తువులపై పరిహార సెస్ పై కూడా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సెస్ 2022తో ముగియాల్సి ఉండగా, రాష్ట్రాలు తమ వ్యయ అవసరాలను తీర్చుకోవాల్సిన అవసరం ఉండటంతో రుణాలను తిరిగి చెల్లించడానికి 2026 మార్చి వరకు పొడిగించడానికి జీఎస్టీ కౌన్సిల్ నేరుగా అంగీకరించింది. రూ. 2.7 లక్షల కోట్ల రుణాలను 2025 నవంబర్ నాటికి తిరిగి చెల్లించాలని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు.
అయితే రాష్ర్టాలను సంప్రదించి ఏ నిర్ణయమైనా తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఈ సందర్భంగా ఆమె నొక్కి చెప్పారు. అందులోకి వెళ్లదల్చుకోలేదని, కానీ ఒక్క సారి సునిశితంగా పరిశీలించి వ్యాఖ్యలు చేయాలని ఆమె సూచించారు.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Nirmala sitharamans response to states criticism of centers cut in gst rates
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com