Nirmala Sitharaman Daughter Marriage: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె పరకాల వాంగ్మయి వివాహం గురువారం బెంగళూరులోని జరిగింది. సాధారణ ఎమ్మెల్యే కొడుకు లేదా కూతరు పెళ్లి అయితేనే నానా హంగామా చేస్తారు. కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి అయిన నిర్మిలా సీతారామన్ కూరుతు పెళ్లి మాత్రం బెంగళూరులోని ఓ ఇంట్లో నిరాడంబరంగా జరిగింది.
బయటకు రాని ఫొటోలు, వీడియోలు..
ఇక, వాంగ్మయి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రాలేదు. కేవలం ఒక ఫొటో మాత్రమే బయటకు వచ్చింది. వివాహానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారని చెబుతున్నారు. ఈ వివాహ వేడుకలో రాజకీయ ప్రముఖులు కనిపించలేదు. బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిపించారు. ఉడిపి అడమరు మఠం సాధువుల ఆశీస్సులతో జరిగింది. ఇక పరకాల వాంగ్మయి భర్త పేరు ప్రతీక్. పరకాల వాంగ్మయి వృత్తిరీత్యా మల్టీమీడియా జర్నలిస్ట్. మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్ లిటరేచర్‌లో బీఎం, ఎంఏ చేశారు. లైవ్ మింట్, ది వాయిస్ ఆఫ్ ఫ్యాషన్, ది హిందూ వంటి సంస్థలతో కలిసి పనిచేశారు.
కనిపించని ప్రభాకర్..
ఇదిలా ఉంటే, విడుదలైన ఫొటోలో నిర్మలా సీతారామన్ తన కూతురు పక్కన నిలబడి ఉన్నారు. వాంగ్మయి తండ్రి, నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ ఎక్కడా కనిపించ లేదు. దీంతో అసలు కుమార్తె వివాహానికి ప్రభాకర్ హాజరయ్యాడా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది కూతురు పెళ్లికి ప్రభాకర్‌కు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాంగ్మయి వివాహ వేడుకపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేంద్ర మంత్రి కూతురు పెళ్లి ఇంత సింపుల్ నిర్వహించడాన్ని అభినందిస్తున్నారు. నిరాడంబర జీవనం అనే ప్రథమ సూత్రాలతో పనిచేయడానికి ఇదొక ఉదాహరణ అని దీపక్ కుమార్ ట్వీట్ చేశాడు.
విడిగా ఉంటున్న నిర్మల, ప్రభాకర్..
ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురానికి చెందిన ప్రభాకర్ ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోనే చేశారు. ఉన్నత విద్య, ఇంటర్ హైదరాబాద్‌లో అభ్యసించారు. ఢిల్లీలో ఎంఏ, ఎంఫిల్ చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. 1986లో నిర్మలా సీతారామన్‌ను పెళ్లి చేసుకున్నారు. రాజకీయ వైరుధ్యం ఉన్న ఇద్దరూ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారని సమాచారం. ప్రభాకర్ ప్రస్తుతం మరో అమ్మాయితో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే కూతురు వివాహానికి ఆహ్వానించలేదని సమాచారం.
అచ్చిరాని రాజకీయాలు..
పరకాల ప్రభాకర్‌కు రాజకీయాలు అచ్చి రాలేదు. కాంగ్రెస్, బీజేపీ, ప్రజారాజ్యంలో పనిచేశారు. మూడు పార్టీల నుంచి అసెంబ్లీ, లోక్‌సభకు పోటీచేశారు. కానీ గెలవలేదు. దీంతో పదేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2018లో ఏపీ ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Nirmala sitharamans daughters wedding parakala prabhakar who is not seen in marriage
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com