వాళ్ళ ఉరి ఇక నుంచి మరో లెక్క!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, అనేక మలుపులు తిరుగుతున్న 2012నాటి నిర్భయ అత్యాచారం,హత్య కేసు ఇప్పుడు మరో కొత్త మలుపును తీసుకొంది. ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు నిందితుల్లో ముగ్గురు అంతర్జాతీయ కోర్టు(ఐసిజి)ను ఆశ్రయించారు. మార్చి 20 ఉద‌యం 5గంటల 30 నిమిషాల‌కు నిందితుల‌ను ఉరితీయాల‌ని ఈ నెల5న పటియాలా కోర్టు నాలుగోసారి కొత్త డెత్ వారెంట్ ను మార్చి5న జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దోషులకు శిక్ష ఇప్పటికే మూడుసార్లు వాయిదా […]

Written By: Neelambaram, Updated On : March 16, 2020 7:06 pm
Follow us on


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, అనేక మలుపులు తిరుగుతున్న 2012నాటి నిర్భయ అత్యాచారం,హత్య కేసు ఇప్పుడు మరో కొత్త మలుపును తీసుకొంది. ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు నిందితుల్లో ముగ్గురు అంతర్జాతీయ కోర్టు(ఐసిజి)ను ఆశ్రయించారు. మార్చి 20 ఉద‌యం 5గంటల 30 నిమిషాల‌కు నిందితుల‌ను ఉరితీయాల‌ని ఈ నెల5న పటియాలా కోర్టు నాలుగోసారి కొత్త డెత్ వారెంట్ ను మార్చి5న జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దోషులకు శిక్ష ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది.

మ‌ర‌ణ‌శిక్ష‌ను ర‌ద్దు చేయాల‌ని ఈ రోజు ముఖేశ్ సింగ్ పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను సుప్రీంకోర్టు ర‌ద్దు చేసింది. క్ష‌మాభిక్ష పిటిష‌న్ ముగిసింది, ఇప్పుడు నీకు ఎటువంటి అవ‌కాశం లేద‌ని, క్యూరేటివ్ పిటిష‌న్ వ‌ర్తించ‌దు అని సుప్రీంకోర్టు చెప్పింది. పిటిషన్‌ విచారణ అర్హత లేదని ముఖేశ్‌ పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దింతో త‌మ‌కు విధించిన మ‌ర‌ణ‌శిక్ష‌పై స్టే విధించాల‌ని కోరుతూ.. అక్ష‌య్ సింగ్‌, ప‌వ‌న్ గుప్తా, విన‌య్ శ‌ర్మ‌లు ఈ రోజు ఇంట‌ర్నేష‌న‌ల్ కోర్ట్ ఆఫ్ జ‌స్టిస్‌ ను ఆశ్రయించారు.