కరోనా ప్రమాదం లేదన్న నీలం సహానీ లేఖపై దుమారం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను భయకంపితులను కావిస్తున్నదంటూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన మరుసటి రోజే రాష్ట్రంలో అటువంటి భయం లేదని `నిర్ధారిస్తూ’,  యధాప్రకారం ఎన్నికలు నిర్వహింపమని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ కమీషన్ కు లేఖ వ్రాయడం రాజకీయ వర్గాలలో పెను దుమారం రేపుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉపద్రవం నుండి బైట పడేందుకు ఎన్నో ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటూ ఉంటె […]

Written By: Neelambaram, Updated On : March 16, 2020 7:26 pm
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను భయకంపితులను కావిస్తున్నదంటూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన మరుసటి రోజే రాష్ట్రంలో అటువంటి భయం లేదని `నిర్ధారిస్తూ’,  యధాప్రకారం ఎన్నికలు నిర్వహింపమని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ కమీషన్ కు లేఖ వ్రాయడం రాజకీయ వర్గాలలో పెను దుమారం రేపుతున్నది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉపద్రవం నుండి బైట పడేందుకు ఎన్నో ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటూ ఉంటె వాటి పట్ల దృష్టి సారించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వచ్చే మూడు నుండి నాలుగు వరాల వరకు రాష్ట్రంలో అటువంటి ప్రమాదం ఏర్పడకుండా ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నట్లు భరోసా ఏ విధంగా ఇవ్వగలరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇప్పటికే పలు రాష్ట్రాలలో విద్యాసంస్థలు , సినిమా హాళ్లను మూసి వేయడంతో పాటు సుప్రీం  కోర్ట్,  హై కోర్టులు  సహితం అత్యవసర కేసులు మాత్రమే చేబడతామని అంటూ ఉంటె ఆమె ఏ విధంగా అటువంటి భరోసా కల్పిస్తారనే ప్రశ్న తలెత్తుతుంది.

ఆమె లేఖ పట్ల ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గత రెండు వారాలుగా ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా కలెక్టర్లు స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థులను `ఏకపక్షంగా ‘ గెలిపించే పనికి ఉంటూ ఈ మరణాంతక వైరస్ గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.

పలు దేశాల నుండి 6,777 మంది ఏపీకి వచ్చారని అంటూ వారెవ్వరూ, వారి పరిస్థితి ఏమిటి ఈ ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు. అసలు ఈ ఉపద్రవం గురించి రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష జరిపిందా అంటూ నిలదీశారు. ఒక తూర్పు గోదావరి జిల్లాలోనే వందలాది మంది ఈ వైరస్ బారిన పడ్డట్లు వార్తలు వస్తున్నాయని చెబుతూ ఎందుకని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వం బేతఖార్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.