ఆ లాయర్ ని కఠినంగా శిక్షించాలని డిమాండ్!

నిర్భయ దోషుల లాయర్ ఏపీ సింగ్ ను కూడా కఠినంగా శిక్షించాలనే వార్త దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. నిర్భయ ఘటన జరిగిన సమయంలో దోషులను సమర్థించిన ఏపీ సింగ్‌.. రాత్రిపూట అమ్మాయిలు బయట తిరిగితే ఇలాంటి ఘటనలే జరుగుతాయని… తన కూతురు ఇలా బాయ్‌ ఫ్రెండ్‌ తో తిరిగితే చంపేసే వాడినంటూ లింగవివక్ష పూరిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. ఇదే విషయాన్నీ ఉటంకింస్తూ..ఆయనను కూడా కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా అనేకమంది ట్వీట్లు […]

Written By: Neelambaram, Updated On : March 19, 2020 6:26 pm
Follow us on

నిర్భయ దోషుల లాయర్ ఏపీ సింగ్ ను కూడా కఠినంగా శిక్షించాలనే వార్త దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. నిర్భయ ఘటన జరిగిన సమయంలో దోషులను సమర్థించిన ఏపీ సింగ్‌.. రాత్రిపూట అమ్మాయిలు బయట తిరిగితే ఇలాంటి ఘటనలే జరుగుతాయని… తన కూతురు ఇలా బాయ్‌ ఫ్రెండ్‌ తో తిరిగితే చంపేసే వాడినంటూ లింగవివక్ష పూరిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. ఇదే విషయాన్నీ ఉటంకింస్తూ..ఆయనను కూడా కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా అనేకమంది ట్వీట్లు చేస్తున్నారు.

ఇప్పటివరకు చట్టంలో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ దోషులను శిక్ష నుంచి తప్పించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్న ఏపీ సింగ్‌.. వరుస పిటిషన్లు, రివ్యూ పిటిషన్లు వేయిస్తూ వారికి అండగా నిలిచారు. ఇక తాజాగా దోషులకు ఎటువంటి చట్టపరమైన అవకాశాలు లేవంటూ ఢిల్లీ కోర్టు పేర్కొనగా.. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లను పటియాలా హౌజ్‌ కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో కోర్టు ప్రాంగణంలో ఏపీ సింగ్‌ మాట్లాడుతూ.. నిర్భయ దోషులు సైనికుల్లా పనిచేస్తారని.. వారికి దేశ సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరడం విశేషం. కాగా అదే విధంగా నిర్భయ దోషులు ఉగ్రవాదులు కాదని.. వారిని క్రూరమైన నేరస్తులుగా చిత్రీకరించి ఎప్పుడో చంపేశారని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే విషయాన్ని ప్రముఖ ఇంగ్లిష్ పత్రిక ట్వీట్ చేయగా.. అనేకమంది రీట్వీట్ చేస్తూ, కామెంట్స్ పెడుతూ నిర్భయను అతి ధారుణంగా హతమార్చిన వారికి ఏపీ సింగ్ అండగా నిలబడాన్ని తప్పుబడుతూ ఆయన కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం గమనార్హం.