తెలుగు సినిమా పరిశ్రమ ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితుల్లో వుంది.కరోనా వైరస్ కారణం గా సినిమా విడుదలలు షూటింగులు కూడా ఆగిపోతున్నాయి తాజాగా మరో సీనియర్ హీరో చిత్రం యొక్క షూటింగ్ కూడా ఆగిపోయింది .
ఎఫ్ 2 , వెంకీ మామ చిత్రాల విజయం తో జోరు మీదున్న విక్టరీ వెంకటేష్ తన 74వ చిత్రం ‘నారప్ప’ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల తమిళనాడు లో స్టార్ట్ చేయడం జరిగింది .ఆ రాష్ట్రములోని తిరుచందూర్ తెరికాడులోని రెడ్ డెసర్ట్ ప్రాంతంలో ఈ చిత్రం షూటింగ్ జరుపు కొంది. తమిళ చిత్రం అసురన్ రీమేక్ గా రూపొందుతున్న నారప్ప పూర్తిగా గ్రామీణ వాతావరణం లో తయారౌతోంది. అందుచేత తమిళ చిత్రం షూటింగ్ జరుపుకున్న ప్రాంతాల్లోనే తెలుగు సినిమా కూడా చిత్రీకరించడం జరిగింది. కాగా అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ ను పూర్తి చేసి ఈ సినిమా షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పారు. ప్రస్తుతం యూనిట్ మొత్తం హైదరాబాద్ చేరుకొంది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నందున ఆ విపత్తు పూర్తిగా తగ్గాకే ” నారప్ప” తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేయనున్నారు. ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రెండవ హీరోయిన్ పాత్రలో మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ ( అను ఇమ్మానుయేల్ సోదరి ) నటించనుంది. కాగా తమిళనాడులో జరిగిన షెడ్యూల్ లో ఇద్దరు హీరోయిన్ లు , వెంకటేష్ పాల్గొన్న కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారట. దళితుల ప్రతినిధి గా పూర్తి వైవిధ్యంగా విక్టరీ వెంకటేష్. కనిపించే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్. కాగా అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. .
Safety measures are more important than shooting