Ration shop : రేషన్ షాపుల్లో బియ్యంతో సహా ఉచితంగా తొమ్మిది రకాల వస్తువులు..అవేంటంటే?

దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు కూరగాయలు, తదితర వంట సామగ్రి కొనలేక పస్తులుంటున్నారు. ఈ నేపథ్యంలో పేదలకు అత్యవసరమైన వంట సామగ్రికి అవసరమయ్యే కొన్ని వస్తువులను ఉచితంగా పంపిణీ చేయానలని నిర్ణయించింది.

Written By: Chai Muchhata, Updated On : September 4, 2024 12:01 pm

Ration Shops

Follow us on

Ration shop : దేశంలోని పేదలకు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా ముందు వరకు ఈ బియ్యం కిలోకు రూ. 1 చొప్పున వసూలు చేసేవారు. ఆ తరువాత దాదాపు ఉచితంగానే ఇస్తున్నారు. కేంద్రం, రాష్ట్రాలు కలిపి తెలంగాణలో అయితే 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నారు. అయితే మూడో సారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ బియ్యంపై కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపులను క్రమబద్ధీకరణ చేసి బియ్యంతో పాటు మరిన్ని వస్తువులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని త్వరలోనే అమలు చేయనున్నారు. రేషన్ షాపుల ద్వారా కేంద్రం అందించే ఆ 9 రకాల సరుకులు ఏవో తెలుసుకుందాం..

దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు కూరగాయలు, తదితర వంట సామగ్రి కొనలేక పస్తులుంటున్నారు. ఈ నేపథ్యంలో పేదలకు అత్యవసరమైన వంట సామగ్రికి అవసరమయ్యే కొన్ని వస్తువులను ఉచితంగా పంపిణీ చేయానలని నిర్ణయించింది. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్ లాంటి కొన్ని నగరాల్లో గోధుమలు కూడా పంపిణీ చేస్తున్నారు. తాజాగా బియ్యం, గోధుమలతో పాటు పప్పులు, చక్కెర, ఉప్పు, ఆవ నూనె, పిండి, సోయాబిన్, మసాలా దినుసులు కూడా పంపిణీ చేయనున్నారు.

దేశంలో రేషన్ షాపుల ద్వారా 90 కోట్ల మంది బియ్యాన్ని పొందుతున్నారు. అయితే వీరికి బియ్యం ఉచితంగా లభించినా మిగతా వస్తులు కొనుగోలు చేయడానికి సరైన ఆదాయం లేదు. దీంతో ప్రస్తుతం ఉన్న ధరలతో రోజూ వారీ కష్టమంతా వీటి ఖర్చుకే వెళ్తుంది. అందువల్ల కొన్ని వస్తువులను కేంద్రం అందించడం వల్ల పేదలకు న్యాయం చేసినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి పౌష్టికాహారం అందించడానికి నాణ్యమైన బియ్యం అందించాలని అనుకుంటున్నారు. వీటితో పాటు వంటకు అవసరమైన సరుకులు కూడా ఇవ్వడం వల్ల పేదలకు పౌష్టికాహారాన్ని అందించిన వారమవుతాయని భావిస్తున్నారు.

ఇటు తెలంగాణలోనూ రేషన్ షాపుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. త్వరలో కొత్త కార్డులను అందించి.. ఆ తరువాత జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రైతులకు సన్నబియ్యం పండించాలని సూచించిన విషయం తెలిసిందే. మరోవైపు కేంద్రం కూడా తొమ్మిది రకాల సరుకులతో సన్నబియ్యం పంపిణీ చేయడం వల్ల లబ్ధిదారులకు న్యాయం చేసినట్లు అవుతామని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే కేంద్రం 9 రకాల సరుకులను ఎప్పటి నుంచి ప్రారంభించనుందో తెలియాలి.

ఇదే కాకుండా రేషన్ షాపుల ద్వారా 9 రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేసి మరికొన్ని వస్తువులను తక్కువ ప్రైస్ తో విక్రయించాలని చూస్తోంది. దీనిపై ఇప్పటికే కేబినేట్ లో చర్చించారు. దేశంలో వస్తువుల ధరలు అధికంగా ఉన్నందున వాటి నుంచి పేదలకు ప్రయోజనం కలిగించడానికి వాటిని పంపిణీ చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా తెలంగాణను ఫైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు.