అసెంబ్లీ సమావేశాలను సొంత అజెండా అమలుకోసమే పెట్టారని, అందుకే కేవలం రెండు రోజులకే పరిమతం చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. అసెంబ్లీ కి వెళుతూ ఎన్.టి.ఆర్.విగ్రహానికి నివాళి అర్పించిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలను కనీసం పదిహేను రోజులు నడపాలని, ఆ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడే అవకాశం వచ్చినా, రాకపోయినా ప్రజా సమస్యలపై పోరాడతామని ఆయన చెప్పారు. ప్రజాధనం దోచుకోవడానికే సంక్షేమం పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆయన ద్వజమెత్తారు. ప్రతిపక్షనేత చంద్రబాబు తో సహా టిడిపి ఎమ్మెల్యేలు నల్లచొక్కాలు ధరించి సభకు వచ్చారు.