బ్రూస్ లీ గురించి సంచలన నిజాలు చెప్పిన పూరి జగన్నాథ్

సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్మాథ్ కు డ్యాషింగ్ డైరెక్టర్ గా మంచి పేరు ఉంది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం.. ఆ మాటలతో అందరినీ మెప్పించడం పూరి అలవాటుగా మారింది. సినిమాలతో బీజీగా ఉండే పూరి జగన్మాథ్ సోషల్ మీడియాలోనూ ఇటీవల యాక్టివ్ గా ఉంటున్నాడు. Also Read: ‘ఆచార్య’తో చిరు ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనిపించుకుంటాడా? ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో కొద్దిరోజులుగా పూరి జగన్మాథ్ ఆసక్తికరమైన విషయాలపై వాయిస్ మేసేజ్ లు పెడుతున్నారు. సమాజంలోని వివిధ సమస్యలపై […]

Written By: NARESH, Updated On : November 17, 2020 11:58 am
Follow us on

సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్మాథ్ కు డ్యాషింగ్ డైరెక్టర్ గా మంచి పేరు ఉంది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం.. ఆ మాటలతో అందరినీ మెప్పించడం పూరి అలవాటుగా మారింది. సినిమాలతో బీజీగా ఉండే పూరి జగన్మాథ్ సోషల్ మీడియాలోనూ ఇటీవల యాక్టివ్ గా ఉంటున్నాడు.

Also Read: ‘ఆచార్య’తో చిరు ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనిపించుకుంటాడా?

‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో కొద్దిరోజులుగా పూరి జగన్మాథ్ ఆసక్తికరమైన విషయాలపై వాయిస్ మేసేజ్ లు పెడుతున్నారు. సమాజంలోని వివిధ సమస్యలపై తనదైన విశ్లేషణ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా పూరి జగన్మాథ్ బ్రూస్ లీ గొప్పతనం.. అతడిలోని మరో కళ గురించి తనదైన శైలిలో వివరించారు.

బ్రూస్ లీని చాలామంది మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం ఉన్న వ్యక్తిగానే ప్రతీఒక్కరు చూస్తుంటారు. కానీ అతడిలో ఉన్న మరో కళ గురించి చాలా మందికి తెలియదని డైరెక్టర్ పూరి తెలిపారు. బ్రూస్ లీ ఫైటరే కాకుండా అద్భుతమైన డాన్సర్ అంటూ కితాబిచ్చాడు. 18ఏళ్ల వయస్సులోనే హంకాంగ్ చా చా చాంపియన్ షిప్ గెలిచాడని తెలిపాడు.

బ్రూస్ లీకి నటనపై ఇంట్రెస్టు ఉండేదని తెలిపాడు. అయితే సినీరంగం విషయంలో అతడి తల్లిదండ్రుల నుంచి బ్రూస్ లీ ప్రోత్సాహం లభించలేదన్నాడు. 13ఏళ్లకే చైల్డ్ ఆర్టిస్టుగా 20సినిమాల్లో నటించాడని తెలిపాడు. సియోటెల్ లో కింగ్ ఫూ నేర్పిస్తూనే వచ్చిన డబ్బుతో ఫిలాఫసీ చదువుకున్నాడని తెలిపారు.

Also Read: కరోనా కంటే.. బాలయ్యే ఎక్కువ భయపెడుతున్నాడు !

బ్రూస్ లీ అమెరికా వెళ్లి అక్కడివారికి కుంగ్ ఫూ నేర్పించేవాడు. చైనేతరులకు కుంగ్ ఫూ నేర్పిస్తున్నాడంటూ అతడిపై కొందరు దాడి చేశారని తెలిపారు. తాను ఒడిపోతే కుంగ్ ఫూ జోలికిపోనని చెప్పి వారందరినీ సెకన్లలో మట్టికరించాడని పూరి తెలిపారు. ఆ తర్వాత సొంతంగా వన్ ఇంచ్ పంచ్ అనే మార్షల్ ఆర్ట్స్ ను కనిపెట్టాడని తెలిపారు. ఇక అతడు నటించిన బిగ్ బాస్.. ఎంటర్ ది డ్రాగన్.. ద గేమ్ ఆఫ్ డెత్ హంకాంగ్ చిత్ర పరిశ్రమ చరిత్రేనే మార్చివేశాయని తెలిపాడు.

బ్రూస్ లీ ఎప్పుడు ఒక మాట చెబుతుంటే వాడని అదంటే తనకు ఎంతో ఇష్టమని పూరి చెప్పాడు. దేవుడిని ఎప్పుడూ సాఫీగా సాగిపోయే జీవితాన్ని ఇవ్వమని కోరుకోవద్దని.. తను పెట్టే కష్టాలను తట్టుకునే శక్తినివ్వమని అడగాలని చెప్పేవాడని పూరి చెప్పాడు. లీ కంటే గొప్ప ఫైటర్లు ఉన్నా అందరికీ అతడే స్ఫూర్తి అని చెప్పుకొచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

కొట్టే ప్రతీ పంచ్ కు లీ ఓ థియరీ చెబుతాడని.. అందరూ అతడి ఫిలాసఫీకి ఫిదా అవుతారని చెప్పాడు. నీరు కప్పులో పొస్తే కప్ ఆకారం.. బాటిళ్లలో పోస్తే బాటిల్ ఆకారం వస్తుందని.. అలా ఏ వస్తువులో పోస్తే అలా కన్పిస్తుందని.. ప్రతీఒక్కరూ నీరు మాదిరిగా ఉండాలని పూరి బ్రూస్ లీ గొప్పతనాన్ని వివరించాడు.