హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను విజయవాడలోని రాజ్ భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఇసిగా తనను పునర్నియమించాలని కోరుతూ వినతి ప్రతాన్ని అందజేశారు. ఉదయం 11.30 గంటల నుంచి అరగంట పాటు వీరద్దరి బేటీ కోనసాగింది. ఈ సందర్భంగా హైకోర్టు తీర్పు, ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేయడం, సుప్రీం కోర్టు ఆదేశాలు, అనంతర పరిణామాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు వివరించారు.
వలసలతో ఏపీకి పెరగనున్న కరోనా ముప్పు..!
ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ తాను చెప్పిన అంశాలన్నీ గవర్నర్ విన్నారని తెలిపారు. ఈ అంశానికి సంబంధించిన అన్ని విషయాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు. గవర్నర్ తనను మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ప్రభుత్వానికి సూచిస్తారనే అశాభావాన్ని నిమ్మగడ్డ వ్యక్తం చేశారు. సమస్యకు సానుకూల పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలను వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. సుప్రీం కోర్టు, హైకోర్టు నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వ వైఖరి సరైంది కాదని స్పష్టం చేశాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టు విడువకుండా న్యాయస్థానాల్లోనే పోరాటం చేస్తుంది. నిమ్మగడ్డ కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉండగా ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
జూలై 24న కేసీఆర్ పెద్ద ప్రకటన చేస్తారా?
గవర్నర్ ఆదేశాలు వచ్చేలోగా తమకు అనుకూలవైన ఆదేశాలు న్యాయస్థానం నుంచి వస్తాయని ప్రభుత్వం ఆశిస్తుంది. వ్యతిరేకంగా తీర్పు వస్తే ఎం చేయాలనే అంశాలపై ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నారు. గవర్నర్ నిమ్మగడ్డ ను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ఆదేశాలు ఇస్తే ప్రభుత్వం ఆ ఆదేశాలను అమలు చేయక తప్పని పరిస్థితి నెలకొంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.