https://oktelugu.com/

కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై సీఎం స్పెషల్ ఫోకస్..!

సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కొత్త సచివాలయాన్ని నిర్మించాలని భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆధునాతన హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ కలలుకన్నారు. కొత్త సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి రూ.500కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. సస్పెన్స్ థిల్లర్ ను తలపించించేలా అనేక మలుపుల మధ్య ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల సుప్రీం కోర్టు కూడా సచివాలయ భవన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 20, 2020 / 03:50 PM IST
    Follow us on


    సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కొత్త సచివాలయాన్ని నిర్మించాలని భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆధునాతన హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ కలలుకన్నారు. కొత్త సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి రూ.500కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. సస్పెన్స్ థిల్లర్ ను తలపించించేలా అనేక మలుపుల మధ్య ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల సుప్రీం కోర్టు కూడా సచివాలయ భవన నిర్మాణంలో జోక్యం చేసుకోమని చెప్పడంతో ప్రభుత్వానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.

    Also Read: కేంద్రం డబ్బు.. కేసీఆర్ పేరు?

    హైకోర్టు అనుమతి వచ్చిన వెంటనే సీఎం ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం సచివాలయ కూల్చివేత పనులను వేగంగా పూర్తి చేస్తోంది. కూల్చివేత పనుల్లో భాగంగా శిథిలాలు సచివాలయం ఆవరణంలో ఉన్న గుడి, మసీదుపై పడటంతో ఆ కట్టడాలు కూడా కూలిపోయాయి. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ కొత్త సచివాలయ నిర్మాణంతో పాటు గుడి, మసీదులను కూడా కొత్తవాటిని ప్రభుత్వమే నిర్మిస్తుందని తెలిపారు. సీఎం ముందుగా స్పందించడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్తపడ్డారు. అయితే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నవేళ సచివాలయ కూల్చివేత, నిర్మాణ పనులు ప్రభుత్వం చేపడుతుండటంపై ప్రజల్లో కొంతమేర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

    అయినప్పటికీ సీఎం కేసీఆర్ కొత్త సచివాలయాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈమేరకు మంగళవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ కొత్త సచివాలయంపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో సచివాలయ డిజైన్, బాహ్యరూపం, లోపల ఉండాల్సిన సదుపాయాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రతిష్ఠ, వైభవం ఉట్టిపడేలా భవనం నిర్మాణం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

    Also Read: కేసులు పెరుగుతున్నాయ్ కానీ.. ఈ శుభవార్త విన్నారా?

    ఈనెల 21నుంచి శ్రావణ మాసం మొదలు కానుంది. మంచిరోజులు ఉండటంతో సీఎం కేసీఆర్ ఇప్పటికే ముహుర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. శ్రావణ మాసంలో భవన నిర్మాణాలు పనులు మొదలుపెట్టి వచ్చే ఏడాది జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావం నాటికి కొత్త సచివాలయాన్ని పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ డెడ్ లైన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. భవన నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

    గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ ఏవిధంగానైతే పర్యవేక్షించారో అలాగే సచివాలయ పనులను కూడా అలాగే పరిశీలిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు. ఎట్టకేలకు సచివాలయ నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగడంతో కేసీఆర్ కలల సౌధం త్వరలోనే పూర్తవడం ఖాయంగా కన్పిస్తుంది.