
తండ్రి వైఎస్సార్ మరణానంతరం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్ని విధాలా ఇబ్బందులు పడాలో అంతకంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్‌తోనూ.. ఇక్కడ చంద్రబాబుతోనూ సామర్థ్యానికి మించి కొట్లాడారు. ఓటిపోయినా మనోనిబ్బరం కోల్పోకుండా ప్రజాక్షేత్రంలోనే ఉండిపోయారు. చివరికి సీఎం అవ్వడంతో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు సీఎంగానూ సక్సెస్ అవుతున్నారు.
అయితే.. జగన్ సర్కార్ కి ఎందరో శత్రువులు. మరెందరో ప్రత్యర్థులు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఒక్క జగన్ మాత్రమే తన గొంతును వినిపించేవారు. బీజేపీ, జనసేన మిత్రులుగా ఉండేవారు. కాంగ్రెస్, వామపక్షాల సౌండ్ కూడా పెద్దగా వినిపించేది కాదు. అదే జగన్ ముఖ్యమంత్రి అనేసరికి మొత్తం విపక్షం ఏకమైపోయింది. ఇక వ్యవస్థలతో కూడా జగన్ సర్కార్ నిత్య పోరాటం చేయడం విధి విచిత్రమే.
Also Read: జగన్ కు షాకిచ్చిన కోర్టు.. కీలక నిర్ణయం
ఏపీలో ఎన్నడూ లేని విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు, ప్రభుత్వానికి మధ్య అతి పెద్ద సమరమే సాగుతోంది. రెండు రాజ్యాంగబద్ధమైన సంస్థల మధ్యన ఉండాల్సింది సహకారం. కానీ.. ఏపీలో మాత్రం సీన్ వేరేలా ఉంది. అన్నీ తానే అంతా తానే అన్నట్లుగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి. వాయిదా వేయాలి అన్నది పూర్తిగా తన ఇష్టం అన్నట్లుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారని అని వైసీపీ నేతలు గుస్సా అవుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి మంట పుట్టించే మరో వార్త ఇప్పుడు ప్రచారంలో ఉంది.
Also Read: ఏపీ ఆర్థిక మంత్రి హస్తిన బాట..: ఎందుకో తెలుసా..!
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఈ ఏడాది మార్చి 31తో ముగియనుంది. కానీ.. ఇప్పుడు మరింతకాలం తన పదవీకాలాన్ని పొడిగించుకోవడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ ప్రచారం ఇప్పుడు వైసీపీ శిబిరాన్ని కలవరపెడుతోంది. దానికి గల కారణాలు. ఆధారాలతో సహా ఆయన మరో తడవ కోర్టు మెట్లు ఎక్కుతారని కూడా అంటున్నారు. అదేంటంటే గతేడాది నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను అకారణంగా దించేసి చెన్నైకి చెందిన కనగరాజ్‌ను రాత్రికి రాత్రి వైసీపీ సర్కార్ ఎస్ఈసీ కుర్చీలో కూర్చోబెట్టింది. దాని మీద నిమ్మగడ్డ ఎంతో పోరాటం చేస్త తప్ప తిరిగి కుర్చీ దక్కలేదు. ఆ విధంగా ఆయనకు మూడు నెలల పదవీ కాలం నష్టం జరిగింది అని లెక్క తేల్చుతున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ఏపీలో పంచాయతీ ఎన్నికలతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీల ఎన్నికలను కూడా నిర్వహించాకే రిటైర్ కావాలని నిమ్మగడ్డ రమేష్ దృఢ నిశ్చయంతో ఉన్నారు. అందుకోసం ఆయన మరో మూడు నెలల గడువును కోర్టు నుంచి తెచ్చుకుంటారని అంటున్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం మూలంగా తన పదవిలో మూడు నెలల విలువైన టైమ్ కోత పడింది కాబట్టి దానికి బదులుగా తనను మరో మూడు నెలలు కొనసాగించాలని ఆయన కోర్టుకు వెళ్తే తీర్పు ఎలా వస్తుందో చూడాలి మరి.