https://oktelugu.com/

నిమ్మగడ్డ మరో బహిరంగ లేఖ.. ఈసారి వాళ్లు టార్గెట్

ఏపీ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేశ్ ఆదివారం కూడా సెలవు తీసుకోకుండా ఏకంగా బహిరంగ లేఖ రాశారు. ఈ సారి లేఖ ఎవరికంటే ఏపీ ఉద్యోగులకు. ఇటీవలే వారంతా స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఏపీ సీఎం జగన్ కు మద్దతుగా ఎన్నికలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే ప్రభుత్వ ఉద్యోగులంతా తాము ఎన్నికలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజాగా బహిరంగ లేఖ రాసి వారిని దువ్వే […]

Written By:
  • NARESH
  • , Updated On : January 10, 2021 / 08:13 PM IST
    Follow us on

    ఏపీ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేశ్ ఆదివారం కూడా సెలవు తీసుకోకుండా ఏకంగా బహిరంగ లేఖ రాశారు. ఈ సారి లేఖ ఎవరికంటే ఏపీ ఉద్యోగులకు. ఇటీవలే వారంతా స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే..

    ఏపీ సీఎం జగన్ కు మద్దతుగా ఎన్నికలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే ప్రభుత్వ ఉద్యోగులంతా తాము ఎన్నికలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజాగా బహిరంగ లేఖ రాసి వారిని దువ్వే ప్రయత్నం చేశారు.

    ఉద్యోగుల కరోనా భయాలను.. అభ్యంతరాలు తనదృష్టికి వచ్చాయని.. వారికి పూర్తి రక్షణ భద్రత కల్పిస్తామని నిమ్మగడ్డ లేఖలో పేర్కొన్నారు.పోలింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్, శానిటైజర్లు ఇస్తామని.. టీకాను వీరికే ఫస్ట్ ఇస్తామని తెలిపారు.

    స్థానిక ఎన్నికలకు సహకరించాలని ప్రకృతి వైపరీత్యాల్లోనూ గొప్పగా పనిచేసిన చరిత్ర ఏపీ ఉద్యోగులది అని నిమ్మగడ్డ లేఖలో కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరిగితీరుతాయని జగన్ కు పరోక్షంగా హెచ్చరికలు పంపారు.

    అయితే ఏపీ సీఎం జగన్ కానీ.. ఆయన కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఏపీలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఎస్ఈసీ ఎంత పెద్ద లేఖ రాసినా కూడా ఆయన మాట వినే అవకాశాలు అయితే లేనట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.