https://oktelugu.com/

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పిల్లి కథ?

ఎప్పటినుండో కాంగ్రెస్‌ పార్టీలో పిల్లికథ ప్రాచుర్యంలో ఉంది. జాతీయ కాంగ్రెస్ పార్టీ కి ఎవర్ని అధ్యక్షన్ని చేయాలనేదే.. ఈ పిల్లి కథ సారాంశం. “పిల్లి మెడలో గంట కట్టాలిగా..” అనే ఒక పిట్ట కథతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షన్ని ఎన్నుకుంటారు. అయితే ఈ అధ్యక్ష రాజీనామా నాటకాలు కాంగ్రెస్ లో కొత్తకాదు. సంక్షోభాలు ఎదుర్కొన్న ప్రతిసారీ ఇలాంటివి చాలానే జరిగాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాహుల్‌ అధ్యక్ష బాధ్యతలనుంచి తప్పుకోవటంతో చాలా రోజులపాటు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 24, 2020 / 05:12 PM IST
    Follow us on

    ఎప్పటినుండో కాంగ్రెస్‌ పార్టీలో పిల్లికథ ప్రాచుర్యంలో ఉంది. జాతీయ కాంగ్రెస్ పార్టీ కి ఎవర్ని అధ్యక్షన్ని చేయాలనేదే.. ఈ పిల్లి కథ సారాంశం. “పిల్లి మెడలో గంట కట్టాలిగా..” అనే ఒక పిట్ట కథతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షన్ని ఎన్నుకుంటారు. అయితే ఈ అధ్యక్ష రాజీనామా నాటకాలు కాంగ్రెస్ లో కొత్తకాదు. సంక్షోభాలు ఎదుర్కొన్న ప్రతిసారీ ఇలాంటివి చాలానే జరిగాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాహుల్‌ అధ్యక్ష బాధ్యతలనుంచి తప్పుకోవటంతో చాలా రోజులపాటు డ్రామా నడిచింది. చివరకు మళ్లీ సోనియాగాంధీకే పగ్గాలు అప్పగించారు.

    తాజాగా సోనియానుంచి మరోసారి రాహుల్‌ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకే లేఖాస్త్రం కథ నడుస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. 2017 డిసెంబర్‌ 16న రాహుల్‌ గాంధీని పార్టీ అధ్యక్షుడిని చేసేందుకు కూడా పార్టీ నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం చేసి గాంధీల చేతినుంచి పార్టీ ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారనే వాదనలు ఉన్నాయి. 1996 నుంచి 98 వరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరి నుంచి సోనియాకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు కూడా ఇలాంటి నాటకమే నడిచిందని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.

    సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు లేఖ రాసిన సీనియర్లపై రాహుల్‌ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సమావేశం ప్రారంభం కాగానే మొదట రాహుల్‌ గాంధీ మాట్లాడారు.  23 మంది సీనియర్లు లేఖరాయడంపై సమావేశం సందర్భంగా రాహుల్‌ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోనియా ఆరోగ్యం సరిగాలేని సమయంలో లేఖ రాసేందుకు సమయం ఇదేనా అని ప్రశ్నించినట్లు తెలిసింది. పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎలా బయటకు వెళ్తున్నాయని ప్రశ్నించారు. పార్టీ విషయాలను అంతర్గత వ్యవహారాలను సోషల్ మీడియాలో, బహిరంగంగా ఎందుకు చర్చిస్తున్నారని ప్రశ్నించినట్లుగా తెలిసింది. సంక్షోభ సమయంలో పార్టీ నాయకత్వ బాధ్యతలపై చర్చ అవసరమా? అన్నట్లు తెలుస్తోంది. నాయకత్వం మార్పు సమయం చూసుకోకుండా లేఖ రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీతో కుమ్మక్కై లేఖ రాసినట్లుగా భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. లేఖ రాయడంపై ఉన్న ఉద్దేశాలను ప్రశ్నించారు. తాను రాజీనామా చేశాక సోనియా గాంధీ విముఖ తెలిపారని, కాంగ్రెస్‌  సీనియర్‌ నేతల ఒత్తిడితోనే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినట్లు ప్రస్తావించినట్లు సమాచారం. కాగా, రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై సీనియర్‌ నేత గులామ్ నబీ ఆజాద్‌ తో పాటు పలువురు నాయకులు స్పందించినట్లు తెలిసింది. బీజేపీతో కుమ్మకైనట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆజాద్‌ అన్నట్లుగా తెలుస్తోంది.