Site icon OkTelugu

ప్రమోషన్‌ కోసం ప్రభాస్ పేరు వాడుకోవడం అవసరమా తేజు?

Is it necessary to use Prabhas name for promotion?

ఛీ..ఛీ.. బోడి మ్యాటర్ చెప్పేందుకు ఇంత  బిల్డప్‌ అవసరమా?  పైగా ఆ ప్రమోషన్‌ కోసం ప్రభాస్‌ పేరు వాడుకోవడమా? అంటూ అభిమానులు ఓ మెగా హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మెగా హీరో ఎవరు? అభిమానులకు ఎందుకు కోపం తెప్పించాడు.. అనుకుంటున్నారా? అతను మరెవరో కాదు మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్. అతను  ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. సుబ్బు దర్శకత్వం వహించిన ఈ సినిమాను బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఎస్ తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్. షూటింగ్‌ కంప్లీట్‌ అయిన ఈ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. ముందుగా మే 1వ తేదీనే విడుదల చేయాలని భావించారు. కానీ, కరోనా దెబ్బకు వాయిదా పడింది. టీజర్,  ‘నో పెళ్లి దాంతల్లి.. ఈ తప్పేం చేయకురా వెళ్లి’ అనే లిరికల్‌ సాంగ్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి.

Also Read : బ్రేకింగ్ : బాలుగారికి కరోనా నెగిటివ్ !

అయితే, సాయి ధరమ్ తేజ్‌ నిన్న (ఆదివారం) ట్విట్టర్లో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ పెట్టాడు. ‘ఒక్కోసారి మ‌నం ఎన్నో అనుకుంటాం కానీ, ఆ టైం వ‌చ్చిన‌ప్పుడు తప్పదు మ‌రి’ అంటూ  ఓ వీడియోను షేర్ చేశాడు. ఇందులో బ్యాచిల‌ర్ హీరోలంద‌రూ క‌లిసి ఉన్న ‘సింగిల్ ఆర్మీ’ అనే వాట్సాప్ గ్రూప్ నుంచి నిఖిల్‌, నితిన్‌, రానా.. ఒక్కొక్కరూ లెఫ్ట్ అయ్యారు. వీళ్లంతా ఈ మధ్యే పెళ్లి చేసుకున్నారు.  చివ‌ర్లో సాయి ధరమ్‌ కూడా ‘ఇట్స్‌ షో టైమ్‌… సారీ ప్రభాస్‌ అన్నా’ అంటూ లెఫ్ట్‌ అవుతాడు. ఈ రోజు ఉదయం పది గంటలకు మరిన్ని వివరాలు చెబుతా అని ట్వీట్‌ చేశాడు. దాంతో, మెగా హీరోకు పెళ్లి కుదిరిందని, దాని గురించే  ఈ రోజు ప్రకటన వస్తుందని అంతా ఆశించారు. అభిమానులంతా సాయి ట్వీట్‌ కోసం వేచి చూశారు. కానీ, వాళ్లందరికీ షాకిచ్చిన చిరు అల్లుడు… తన మూవీ గురించి మాత్రమే అప్‌డేట్‌ ఇచ్చాడు. ‘అంత  కఠినం గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృత ని చూసాక ఏమైంది ???’ అని ట్వీట్‌ చేసిన సాయి ధరమ్‌ ఈ మూవీలో  ‘హే ఇది నేనేనా’ అనే  పాటను ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించాడు. అలాగే, హీరోయిన్‌ నభా నటేష్‌, తాను ఉన్న ఓ పోస్టర్ను కూడా షేర్ చేశాడు.

అయితే,  ప్రభాస్‌ పేరు వాడుకొని ట్విట్టర్లో నిన్న అతను చేసిన హడావుడంతా కేవలం సోలో బ్రతుకే సినిమా ప్రమోషన్‌ కోసమే అని స్పష్టమైంది. దాంతో, కొంత మంది తేజుపై  విమర్శలు ఎక్కు పెట్టారు. సినిమా ప్రమోషన్‌ విషయాన్ని నేరుగా చెప్పాలి గానీ.. ఇంత బిల్డప్‌ ఇవ్వడం ఎందుకు?  దానికి ప్రభాస్‌ పేరు వాడుకోవడం ఎందుకు? ఇదంతా చీప్‌ పబ్లిసిటీ స్టంట్‌ అంటూ సోషల్‌ మీడియాలో  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సాయి రియాక్షన్‌ ఎలా ఉంటుందో మరి?

https://twitter.com/IamSaiDharamTej/status/1297753014300631040
Also Read : మెగాస్టార్ ‘ఆచార్య’ షూటింగ్ డిటైల్స్ ! 
Exit mobile version