NewsX Pre-Poll Survey: వచ్చే ఏడాదిలో జరిగే పలు స్టేట్ల ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు పలు సర్వేలు తమ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. దీంతో పార్టీల్లో ఒకటే ఆందోళన నెలకొంటోంది. ఎలాగైనా తమ పార్టీ అధికారం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. గోవా, పంజాబ్ స్టేట్లలో ఫలితాలపై న్యూస్ ఎక్స్ ప్రీ పోల్ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో విస్తుగొలిపేలా ఫలితాలు వచ్చాయి. గోవాలో బీజేపీ, పంజాబ్ లో ఆప్ విజయం సాధించి అధికారం చేపడతాయని సర్వే చెబుతోంది. దీంతో ఆయా పార్టీల్లో భయం మొదలైంది.
ఇప్పటికే కాంగ్రెస్ తన స్వయంకృతాపరాధంతో దిగజారిపోవడంతో పలు చోట్ల దానికి వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి. సీఎంలను మార్చడంతో పార్టీ ప్రతిష్ట మరింతగా మసకబారిపోయింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను నమ్ముకున్నా ఫలితాలు మాత్రం కానరావడం లేదు. ఎన్ని ఎత్తులు వేసినా కాంగ్రెస్ మునిగిపోయే నావగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో దానికి చేదు అనుభవాలే ఎదురుకానున్నట్లు తెలుస్తోంది.
గోవాలో 40 సీట్లకు గాను బీజేపీ 20-22 గెలుచుకుని అధికారం చేపడుతుందని తెలిపింది. కాంగ్రెస్ 4-6 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని తేల్చింది. దీంతో రెండో స్థానాన్ని అమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గోవాలో బీజేపీ విజయఢంకా మోగిస్తుందని సర్వే వెల్లడించింది.
Also Read: కొడుకు కోసం తుక్కు సామానుతో కారు తయారు చేశాడు.. మహీంద్రా ఓనర్ బంపర్ ఆఫర్
పంజాబ్ లో అమ్ ఆద్మీ పార్టీ అధికారం నిలబెట్టుకుంటుందని జోస్యం చెప్పింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంటుందని తెలుస్తోంది. అమ్ ఆద్మీ పార్టీ 47-52 సీట్లలో విజయం సాధిస్తుండగా కాంగ్రెస్ 40-45 సీట్లు గెలుచుకుని రెండో బెర్తును ఖాయం చేసుకుంటోందని చెబుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆశలు సమాధి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంజాబ్ లో ఎన్ని ప్రయోగాలు చేసినా చివరకు అపజయమే అపహాస్యం చేసేలా కనిపిస్తోంది.
Also Read: Omicron: కమ్ము కొస్తున్న ‘ఒమిక్రాన్’ మబ్బు.. ఫిబ్రవరిలో లాక్ డౌన్?