https://oktelugu.com/

RRR: ప్రో కబడ్డీ వేదికపై ఆర్​ఆర్​ఆర్​ టీమ్​ సందడి.. ప్రమోషన్స్​ మాములుగా లేవుగా!

RRR: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్​ఆర్​ఆర్​ మేనియా కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలకు 20 రోజులు కూడా లేదు. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, బాహుబలి సినిమా తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో.. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రామ్​చరణ్​, తారక్​ హీరోలుగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్​.. అన్ని భాషల్లో మిలియన్ల వ్యూస్​తో దూసుకెళ్లిపోతోంది. కాగా, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 23, 2021 / 09:39 AM IST
    Follow us on

    RRR: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్​ఆర్​ఆర్​ మేనియా కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలకు 20 రోజులు కూడా లేదు. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, బాహుబలి సినిమా తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో.. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రామ్​చరణ్​, తారక్​ హీరోలుగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్​.. అన్ని భాషల్లో మిలియన్ల వ్యూస్​తో దూసుకెళ్లిపోతోంది. కాగా, ఈ క్రమంలోనే విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్​పై దూకుడు పెంచారు జక్కన్న. ఇందు కోసం చాలా భిన్నమైన పద్దతులను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

    తాజాగా, తారక్​, చరణ్​, నిన్న సాయంత్రం ప్రో కబడ్డీ ప్రారంభ వేడుకలో జాతీయ, ప్రాంతీయ స్పోర్ట్స్ ఛానెల్స్​లో సినిమాను ప్రమోట్​ చేశారు. ప్రస్తుతం ఇదే హాట్​ టాపిక్​గా మారింది. ఐపీఎల్ తర్వాత అంతటి భారీ ఫ్యాన్​ ఫాలోయింగ్​తో దూసుకెళ్లిపోతున్న కబడ్డీ(పీకేఎల్‌) ఎనిమిదో సీజన్​ను బుధవారం ఆర్​ఆర్​ఆర్ హీరోలతో పాటు దర్శకుడు రాజమౌళి ప్రారంభించారు.

    https://twitter.com/StarSportsTel/status/1473667961307033601?s=20

    పవర్​ఫుల్​ గేమ్​కు ఇంతకంటే పదునైన ప్రారంభం ఏముంటుంది?.. అనే క్యాప్షన్​తో సోషల్ మీడియా వేదికగా స్టార్​ స్పోర్ట్స్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలను నెట్టింట వైరల్​గా మారాయి. స్వాతంత్య్ర సమరయోధులైన భీమ్​, అల్లూరి సీతారామరాజుల పాత్రకు కల్పితాన్ని జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో అజయ్​దేవగణ్​, శ్రియా, ఒలివియా మోరిస్​, అలియాభట్​, తదితరులు కీలక పాత్రల్లో నటించారు.