Nara Lokesh: నారా లోకేష్.. ఈయన్ను టీడీపీ తమ్ముళ్లు భావి అధ్యక్షుడిగా భావిస్తున్నారు. చంద్రబాబుకు ఎటూ వయసు అయిపోతుంది కాబట్టి లోకేష్‌నే తన వారసుడిగా నడిపించి పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. కానీ చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో రాణించలేకపోతున్నారు లోకేష్. కేవలం సోషల్ మీడియాలోనే రాణించారు తప్ప.. వాస్తవ రాజకీయాల్లో ఎవరినీ మెప్పించలేకపోతున్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఐరన్ లెగ్ అని ముద్ర వేసుకున్నారు.
ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. లోకేష్ వచ్చిన తర్వాత పార్టీలో సీనియర్లకు ప్రాముఖ్యత తగ్గిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక లోకేష్ కూడా ఎక్కడక వెళ్లినా ప్రజలను మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. లోకేష్ కు స్వంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేదని, ఆయన వెంట ఉండే టీమ్ చెప్పినట్టే మాట్లాడుతారని, వారు ఏది రాసిస్తే అది మాట్లాడుతారని టాక్ ఉంది. ఇప్పటికి లోకేష్ రాజకీయాల్లోకి వచ్చి ఐదేండ్లు గడుస్తున్నాయి. కానీ ఆయన మాత్రం పెద్దగా మార్పు చెందలేదని చెబుతున్నారు.
ఎక్కడైనా బహిరంగ సభల్లో మాట్లాడినా పెద్దగా పదునుండట్లేదు. ఎంత సేపు జగన్‌ను విమర్శించి తనను తాను నేతగా ప్రూవ్ చేసుకోవాలని అనుకోవడమే తప్ప ప్రజలను ఆకర్షించే స్థాయిలో ఆయన మాటలు లేవు. ఇక లోకేష్‌ను తమ నియోజకవర్గాలకు తీసుకెళ్లి సభలు పెట్టాలనుకునే వారు కూడా టీడీపీలో తగ్గిపోతున్నారు. ఎందుకంటే లోకేష్ వస్తే ఖర్చు తప్ప.. ఒరిగేదేమీ ఉండదని భావిస్తున్నారు. ఆయన వల్ల ఏ మాత్రం ప్రజలు తమవైపు తిప్పుకోలేకపోతున్నామని భావిస్తున్నారు.
Also Read: Ashok Gajapati Raju: అశోక్ గజపతి రాజుపై మరో అస్త్రాన్ని గురిపెట్టిన జగన్ ప్రభుత్వం..
ఇక మంగళ గిరిలో ఓటమితో ఆయన మీద ఎవరికీ పెద్దగా నమ్మకం లేకుండా పోయింది. భారీ అంచనాలతో రాజకీయాల్లోకి వచ్చినా.. వాటిని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా మంగళగిరి నుంచే పోటీ చేసేందుకు లోకేష్ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ రెండుసార్లు ఆళ్ల కృష్నారెడ్డి గెలిచాడు కాబట్టి.. మూడోసారి ఆయనకు ప్రజలు అవకాశం ఇవ్వకపోవచ్చని భావిస్తున్నారు లోకేష్. మరి ఆయన ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Also Read: MP Avinash Reddy: సీబీఐ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోబోతుందా.. అసలేం జరుగుతుంది!