CM Revanth Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఎన్నైనా వేషాలు వేయొచ్చు. అదే అధికారం దూరమైతే అప్పటిదాకా వేసిన వేషాలకు స్వస్తి పలకాల్సిందే. పర్ సపోజ్ యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎన్డిటివి చైర్మన్ ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకునేవారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ వార్తలు ప్రసారం చేసేవారు. దేశాన్ని కుదిపేసిన 2 జీ స్పెక్ట్రమ్, కామన్ వెల్త్, నిర్భయ వంటి ఘటనల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించలేదు. తర్వాత బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొంతకాలానికి కొంతకాలానికి ఎన్డి టీవీ ని ఆయన అమ్ముకోవాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే సాధారణంగా మీడియా హౌస్ న్యూట్రల్ గా ఉంటే వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. ఒక పార్టీకి డప్పు కొడితే మాత్రం తేడా వస్తుంది. డప్పు కొట్టిన పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే అధికారానికి ఆ పార్టీ దూరమైతుందో అప్పుడే అసలు సమస్యలు మొదలవుతాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నమస్తే తెలంగాణ పత్రిక ది కూడా అదే పరిస్థితి..
డప్పు కొట్టింది
నమస్తే తెలంగాణ పత్రికను లక్ష్మీ రాజ్యం ప్రారంభించినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కెసిఆర్ కుటుంబ సభ్యులు టేక్ ఓవర్ చేసుకున్నారు. దాదాపు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న రోజులు నమస్తే తెలంగాణ పత్రికలో ప్రతిపక్షానికి కొంచెం కూడా స్పేస్ ఉండేది కాదు. రోజుకు లీటర్ల కొద్దీ బురదను ప్రతిపక్ష నాయకుల మీద చల్లేది. నేను బురద పోస్తున్నాను. కడుక్కోవడం నీ కర్మ అనే విధంగా దాని వ్యవహార శైలి ఉండేది. ఇక మొన్నటికి మొన్న ఎన్నికల సమయంలో అయితే ఎంత విషం చిమ్మాలో అంత విషం చిమ్మింది. పేజీలకు పేజీలు ప్రింట్ చేసి ఉచితంగా కాపీలు కూడా పంపిణీ చేసింది.. ఇక ఎడిటోరియల్ వ్యాసాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేకుండా దుష్ప్రచారానికి దిగింది. మూడోసారి కూడా కేసీఆర్ అధికారం లోకి వస్తారనే భ్రమలో ఉండేది. కానీ ప్రజల తీర్పు మాత్రం మరో విధంగా వచ్చింది.. దీంతో నమస్తే తెలంగాణకు తత్వం బోధపడింది.
ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఉన్నప్పుడు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు.. వారు నిర్వహించే విలేకరుల సమావేశాన్ని, బహిరంగ సభను ఒక బాధ్యతాయుత మీడియా సంస్థగా నమస్తే తెలంగాణ ఎప్పుడు కూడా వార్తలను ప్రచురించలేదు. చివరికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ పలుమార్లు హైదరాబాదుకు వచ్చినప్పటికీ పట్టించుకోలేదు. 10 సంవత్సరాలు కేవలం కేసీఆర్, భారత రాష్ట్ర సమితి వార్తల వరకే పరిమితమయిపోయింది. ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావటం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఒక్కసారిగా నమస్తే తెలంగాణకు తెలంగాణలో జరుగుతున్న అసలు సన్నివేశం అర్థమైంది. ఇన్ని రోజులు చేసిన గులాబీ కీర్తనను ఇక నిలుపుదల చేయాలని నిర్ణయించుకుంది.. అయితే ఇది గులాబీ పార్టీ పెద్దల నిర్ణయమా? ప్రభుత్వం గురించి వార్తలు రాయపోతే యాడ్స్ రావనే భయమా? అనేవి తెలియదు గాని.. గత ప్రభుత్వ తప్పిదాలను 12 శాసనసభలో రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే.. నమస్తే తెలంగాణ ఈరోజు బ్యానర్ వార్తగా ప్రచురించింది.. ఎటువంటి పదాలు వాడటం ఆ పత్రికలో నిషిద్ధమో.. అవి ఈరోజు ఆ పత్రికలో కనిపించాయి.. మీడియా మీడియా లాగా ఉంటే ఈరోజు నమస్తే తెలంగాణకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అందుకే పెద్దలంటారు యద్భావం తద్భవతి అని..