New Rule For Government: సర్కార్‌కు కొత్త రూల్‌.. సింగరేణికి పాత రూల్‌!

– ఉద్యోగ నియామకాల్లో భిన్న తీరు – వయోపరిమితి విషయంలో గందరగోళం – నష్టపోతామంటున్న సింగరేణి ప్రభావిత జిల్లాల యువత New Rule For Government: సింగరేణి.. తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ. కోలిండియాకు దీటుగా బొగ్గు ఉత్పత్తి సాధిస్తూ.. ఏటా లాభాలు, టర్నోవర్‌ పెంచుకుంటూ పోతోంది సింగరేణి. ఐదేళ్ల తర్వాత సింగరేణిలో ఎక్స్‌టర్నల్‌ క్లర్కు పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 177 క్లర్క్‌ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో సింగరేణి ప్రభావిత ప్రాంత […]

Written By: Sekhar Katiki, Updated On : June 20, 2022 3:02 pm
Follow us on

– ఉద్యోగ నియామకాల్లో భిన్న తీరు
– వయోపరిమితి విషయంలో గందరగోళం
– నష్టపోతామంటున్న సింగరేణి ప్రభావిత జిల్లాల యువత

New Rule For Government: సింగరేణి.. తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ. కోలిండియాకు దీటుగా బొగ్గు ఉత్పత్తి సాధిస్తూ.. ఏటా లాభాలు, టర్నోవర్‌ పెంచుకుంటూ పోతోంది సింగరేణి. ఐదేళ్ల తర్వాత సింగరేణిలో ఎక్స్‌టర్నల్‌ క్లర్కు పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 177 క్లర్క్‌ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో సింగరేణి ప్రభావిత ప్రాంత అభ్యర్థులకు 90 శాతం, ఇతర జిల్లాల అభ్యర్థులకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఉద్యోగాల అర్హత విషయంలో, ప్రధానంగా వయోపరిమితి విషయంలో గందరగోళం నెలకొంది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వరంగ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం 40 ఏళ్లకు పెంచింది. అయితే 8 ఏళ్లుగా పెద్దగా నోటిఫికేషన్లు రాలేదు. ఇటీవలే నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే గ్రూప్‌–1తోపాటు విద్యుత్, వైద్య శాఖతోపాటు పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది.

CM KCR

కరోనా కారణంగా వయోపరిమితి పెంపు..

తెలంగాణలో చాలా కాలం తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావడం, కరోనా కారణంగా రెండేళ్లలో చాలామంది ప్రైవేటు ఉద్యోగాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల యూనిఫాం కాకుండా ఇతర ఉద్యోగాల వయోపరిమితిని గరిష్టంగా ఏదేళ్లు పెంచింది. దీంతో 45 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఇది నిరిద్యోగులకు గొప్ప ఊరటనిచ్చింది. యూనిఫాం ఉద్యోగాలకు మాత్రం వయోపరిమితిలో సడలింపు ఇవ్వలేదు. అయినా పోలీస్‌ ఉద్యోగాలకు 12 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్‌ – 1 పోస్టులకు వయోజరిమితి సడలింపు వర్తించడంతో 5 లక్షలకుపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల సంఖ్య ఆధారంగా నిరుద్యోగ రేటు ఎలా ఉందో అర్థమవుతోంది.

సింగరేణిలో పాత నిబంధనే…

Singareni Mines

Also Read: Demolition Of Ayyanna Patrudu House: అయ్యన్నపాత్రుడి ఇల్లు కూల్చివేత: జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్

సింగరేణిలో 177 క్లరికల్‌ పోస్టుల భర్తీకి జూన్‌ 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అయితే సంస్థ అభ్యర్థుల వయోపరిమితి సడలింపులో పాత నిబంధనే విధించింది. గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, బీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఇచ్చింది. ఇక్కడే సమస్య మొదైలంది. స్థానికత విషయంలో ఎలాంటి వివాదం లేదు. కానీ ఐదేళ్ల తర్వాత వచ్చిన సింగరేణి ఉద్యోగ నోటిఫికేషన్‌కు వయోపరిమితి విషయంలో సడలింపు ఇవ్వకపోవడంపై ఈ ప్రాంత నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు 45 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి మాత్రం పాత విధానంలోనే వయోపరిమితి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వయోపరిమితి పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సింగరేణిలో పెరిగిన నిరుద్యోగం..

సింగరేణి సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో విస్తరించిఉంది. ఈ జిల్లాల పరిధిలోని అభ్యర్థులకు సింగరేణి ఉద్యోగాల్లో 90 శాతం అవకాశం ఉంటుంది. అయితే ఏళ్లుగా సింగరేణి నుంచి ఎలాంటి నోటిఫికేషన్లు రాకపోవడం, వారసత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యం జరుగుతండం, రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రైవేటు ఉద్యోగాలు ఊడిపోవడంతో సింగరేణి ప్రభావిత జిల్లాల్లో నిరుద్యోగుల రేటు భారీగా పెరిగింది. 177 క్లర్క్‌ పోస్టులకు ప్రస్తుత నిబంధనలతో లక్షకు పైగా దరఖాస్తులు వస్తాయని సింగరేణి అధికారులు అంచనా వేశారు. వయోపరిమితి సడలింపు ఇస్తే మరో లక్ష వరకు దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంటుందని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు వర్తించే నిబంధనలనే సింగరేణిలో అమలు చేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. దీనిపై సింగరేణి యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Also Read: Only Nani Touched NTR Record: ఎన్టీఆర్ రికార్డు ని టచ్ చేసిన ఏకైక హీరో నానీ ఒక్కడే

Tags