Mahesh- Nani Movies: ఫ్లాప్ టాక్ తో హిట్… హిట్ టాక్ తో ఫ్లాప్ , మహేష్-నాని చిత్రాల సమీకరణాలు ఎందుకు మారాయంటే!

Mahesh- Nani Movies: ఈ మధ్య కాలంలో విడుదలైన రెండు చిత్రాలు విచిత్రమైన రిజల్ట్ అందుకున్నాయి. ప్లాప్ టాక్ తెచ్చుకున్న సర్కారు వారి పాట హిట్ కొట్టగా, బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న అంటే సుందరానికీ ప్లాప్ ఖాతాలో చేరింది. దీనికి కారణం ఏమిటని పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సమ్మర్ కానుకగా మే 12న సర్కారు వారి పాట విడుదల చేశారు. ఈ చిత్ర ట్రైలర్ తో పాటు థమన్ సాంగ్స్ సినిమాపై హైప్ […]

Written By: Shiva, Updated On : June 20, 2022 2:56 pm

Nani, Mahesh

Follow us on

Mahesh- Nani Movies: ఈ మధ్య కాలంలో విడుదలైన రెండు చిత్రాలు విచిత్రమైన రిజల్ట్ అందుకున్నాయి. ప్లాప్ టాక్ తెచ్చుకున్న సర్కారు వారి పాట హిట్ కొట్టగా, బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న అంటే సుందరానికీ ప్లాప్ ఖాతాలో చేరింది. దీనికి కారణం ఏమిటని పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సమ్మర్ కానుకగా మే 12న సర్కారు వారి పాట విడుదల చేశారు. ఈ చిత్ర ట్రైలర్ తో పాటు థమన్ సాంగ్స్ సినిమాపై హైప్ పెంచాయి. మంచి ఆన్లైన్ బుకింగ్స్ సర్కారు వారి పాట దక్కించుకుంది. మే 11 అర్ధరాత్రి యూఎస్ ప్రీమియర్స్ ప్రదర్శన మొదలుకాగా.. టాక్ బయటకు వచ్చింది.

Mahesh Babu

సర్కారు వారి పాట బాగోలేదంటూ వేలకొలది ట్వీట్స్ వెల్లువెత్తాయి. రివ్యూలు కూడా ఏమంత ఘనంగా ఇవ్వలేదు. ఈ ఇంపాక్ట్ రెండో రోజు వసూళ్లపై పడింది. అయితే పాజిటివ్ మౌత్ టాక్ తో సర్కారు వారి పాట మూడో రోజు పుంజుకుంది. హాలిడేస్ కావడంతో వీక్ డేస్ లో సర్కారు వారి పాట సాలిడ్ వసూళ్లు దక్కించుకుంది. జూన్ 3న విక్రమ్, మేజర్ థియేటర్స్ లోకి వచ్చే వరకు సర్కారు వారి పాట రన్ కొనసాగింది. లాంగ్ రన్ నేపథ్యంలో మిక్స్డ్ టాక్ లో కూడా సర్కారు వారి పాట హిట్ కొట్టింది. వరల్డ్ వైడ్ రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సర్కార్ వారి పాట ఆ మార్క్ దాటి హిట్ స్టేటస్ దక్కించుకుంది.

Also Read: Lady Contestant Blackmailed: బ్లాక్ మెయిల్ చేసి మరీ జబర్ధస్త్ కొచ్చిన ఆ లేడీ కంటెస్టెంట్

దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి నాని అంటే సుందరానికీ ఎదురైంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా విడుదలైన అంటే సుందరానికీ ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి క్రిటిక్స్ మంచి రేటింగ్ ఇచ్చారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంటే సుందరానికీ నానికి మంచి హిట్ కట్టబెడుతుందని అందరూ భావించారు. అనూహ్యంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన అంటే సుందరానికీ కేవలం 60 శాతం రికవరీ సాధించింది.

Nani, Nazriya

దాదాపు అంటే సుందరానికీ రన్ ముగిసినట్లే ఈ క్రమంలో రూ. 10 కోట్లకు పైగా నష్టాలు మిగల్చనుంది. మహేష్, నాని చిత్రాలు ఇలా విరుద్ధమైన ఫలితాలు అందుకోవడానికి స్టార్ డమ్ ఒక కారణం అయితే.. టైర్ టు హీరోల చిత్రాలను ప్రేక్షకులు థియేటర్స్ కంటే ఓటీటీలోనే ప్రిఫర్ చేస్తున్నారు. పెరిగిన టికెట్స్ ధరల కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడం లేదు. నలుగురు కలిసి సినిమా చూడాలంటే రూ. 2000 ఖర్చయ్యే పరిస్థితి. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ టూ టైర్ హీరోల చిత్రాలను ఓటీటీలో చూడాలనుకుంటున్నారు. ఎటూ మూడు వారాల్లో మూవీ వచ్చేస్తుంది, కాబట్టి కొంచెం ఓపిక పడితే హ్యాపీగా ఇంట్లో చూడొచ్చు అనుకుంటున్నారు. ఇక భారీ ఫ్యాన్ బేస్ కలిగిన స్టార్ హీరోల సినిమాలను మాత్రం అధిక ధరలు చెల్లించి సినిమా చూడాలని అనుకుంటున్నారు.

Also Read: Ante Sundaraniki OTT Date: అంటే సుందరానికి OTT రిలీజ్ డేట్ వచ్చేసింది

Tags