https://oktelugu.com/

జగన్‌ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో కొనసాగుతున్న మంత్రివర్గం భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి రాజధాని పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలపై చర్చించారు. అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేసేందుకు రూ.3 వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్‌ అంగీకరించింది. Also Read: కడపలో జగన్‌కు షాక్‌ : టీడీపీ మద్దతుదారుల విజయం కాకినాడ ఎస్‌ఈజెడ్‌ భూముల వ్యవహారంలో రైతులకు నష్టపరిహారాన్ని ఖరారు చేసే అంశంపైనా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కమిటీ సూచించిన […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 23, 2021 3:26 pm
    Follow us on

    Jagan Cabinet
    ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో కొనసాగుతున్న మంత్రివర్గం భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి రాజధాని పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలపై చర్చించారు. అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేసేందుకు రూ.3 వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్‌ అంగీకరించింది.

    Also Read: కడపలో జగన్‌కు షాక్‌ : టీడీపీ మద్దతుదారుల విజయం

    కాకినాడ ఎస్‌ఈజెడ్‌ భూముల వ్యవహారంలో రైతులకు నష్టపరిహారాన్ని ఖరారు చేసే అంశంపైనా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కమిటీ సూచించిన నష్టపరిహారం కంటే ఎక్కువగా ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఎస్‌ఈజెడ్‌ పరిధిలోని ఆ ఆరు గ్రామాలను తరలించేందుకు మినహాయింపునిచ్చింది. వైఎస్సార్‌‌ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం భాగస్వామ్య సంస్థ ఎంపికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    Also Read: చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు

    ఈబీసీ కులాల మహిళలకు ఈబీసీ నేస్తం పథకానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. వచ్చే మూడేళ్లలో ఒక్కో మహిళా లబ్ధిదారుకు ఈ పథకం ద్వారా రూ.45 వేలు అందించనున్నారు. కడప జిల్లాలో రెండు పారిశ్రామిక పార్కులకు భూ కేటాయింపులపై చర్చ జరిగింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపైనా కేబినెట్‌ చర్చించింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్