https://oktelugu.com/

జగన్ ‘ఇంగ్లిష్ మీడియం’కు కొత్త చిక్కులు?

కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టనుంది. గడిచిన 34ఏళ్లుగా కొనసాగుతున్న విద్యా విధానాన్ని సమూలంగా మార్చేందుకు మోడీ సర్కార్ పూనుకుంది. పాత విద్యావిధానం నేటి సాంకేతికకు తగ్గట్లు లేవని భావించినా కేంద్రం కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ఇటీవల నిర్ణయం తీసుకుంది. కేంద్రం క్యాబినెట్ నిర్ణయానికి ప్రధాని మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానం అమల్లోకి రానుంది. Also Read: విద్యావ్యాపారాన్ని ప్రక్షాళించిన మోదీ కొన్ని దశాబ్దాలుగా విద్యావిధానంలో ఎలాంటి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 30, 2020 / 05:21 PM IST
    Follow us on


    కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టనుంది. గడిచిన 34ఏళ్లుగా కొనసాగుతున్న విద్యా విధానాన్ని సమూలంగా మార్చేందుకు మోడీ సర్కార్ పూనుకుంది. పాత విద్యావిధానం నేటి సాంకేతికకు తగ్గట్లు లేవని భావించినా కేంద్రం కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ఇటీవల నిర్ణయం తీసుకుంది. కేంద్రం క్యాబినెట్ నిర్ణయానికి ప్రధాని మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానం అమల్లోకి రానుంది.

    Also Read: విద్యావ్యాపారాన్ని ప్రక్షాళించిన మోదీ

    కొన్ని దశాబ్దాలుగా విద్యావిధానంలో ఎలాంటి మార్పులు జరుగలేదు. దీంతో కాలానికి తగ్గట్టు విద్యార్థుల నైపుణ్యాలు పెరగడంలేదని వాదనలు విన్పించాయి. ఇక కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ తాజాగా విద్యావిధానంలో సంస్కరణలు అమలు చేసేందుకు ముందుకొచ్చింది. మూడు దశాబ్దాలకు పైగా ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతున్న విద్యా విధానానికి స్వస్తి పలికింది. ప్రస్తుత సాంకేతికను అందిపుచ్చుకునేలా మోడీ సర్కార్ కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది.

    మోడీ సర్కార్ నూతన విద్యా విధానానికి ఆమోదముద్ర వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అయితే ఇది జగన్ సర్కార్ కు కొంత ఇబ్బంది తెచ్చిపెట్టేలా కన్పిస్తుంది. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని రాష్ట్రాల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు వారి మాతృభాషలోనే విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ప్రైవేట్ పాఠశాలల్లో ఎలా ఉన్నా ప్రభుత్వ పాఠశాలలు మాత్రం తప్పనిసరిగా అమలు చేయాల్సిందే. దీంతో సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంగ్లీష్ మీడియం చదువులకు బ్రేకులు పడినట్లే కన్పిస్తుంది.

    Also Read: బాబు మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారా?

    సీఎం జగన్ ఏపీలో ఒకటో తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం చదువులను అమలు చేయాలని భావించారు. రానున్న రోజుల్లో విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ఇంగ్లీష్ మీడియం చదువులు అందించాలని భావించారు. జగన్ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, పలు విద్యార్థి సంఘాలు వ్యతిరేకించినా జగన్ ఇంగ్లీష్ మీడియం చదువులను అమలు చేసేందుకే మొగ్గుచూపారు. జగన్ నిర్ణయంపై పలువురు హైకోర్టుకు కూడా వెళ్లారు.

    ఇదిలా ఉంటే కేంద్రం తాజాగా నూతన విద్యావిధానంలో ఐదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యార్థులకు బోధించాలని కండిషన్ పెట్టింది. దీంతో జగన్ ఇంగ్లీష్ మీడియం చదువులకు బ్రేక్ పడేలా కన్పిస్తుంది. మరోవైపు ఐదో తరగతి దాకా తెలుగు మీడియం చదివిన విద్యార్థులకు ఆరో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలంటే అంత సులభం కాదనే వాదనలు విన్పిస్తున్నాయి. ఈ విషయంలో సీఎం జగన్ ఏవిధంగా ముందుకెళుతారో వేచి చూడాల్సిందే..!