నట సింహం నందమూరి బాలకృష్ణకు ఒక వీక్ నెస్ ఉంది, నచ్చితే ఆదరిస్తారు, నచ్చకపోతే ఎదురు పడినందుకే కొడతానంటారు. ఏమైనా బాలయ్య స్టైలే వేరు. ప్రస్తుతం బాలయ్య ఓ మంచి పని చేశారు. కరోనాతో పోరాడి రోగానిరోధిక శక్తిని పెంచే మందులను సినీ కార్మికులకు అందచేశారు. నేటితో ఈ కార్యక్రమం పూర్తయింది. దాదాపు పది వేలమందికి పైగా బాలయ్య మందులను పంపిణి చేశారు. అయితే ఇదంతా బాలయ్య చేయడానికి ఓ కారణం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ టాపిక్ బాగా హల చల్ చేస్తోంది. సీసీసీ అంటూ మెగాస్టార్ నిత్యవసర వస్తువుల పంపణీకి హెడ్ గా ఉంటూ మంచి పేరు కొట్టేశారు. నిజానికి సీసీసీకి కూడా బాలయ్య భారీ విరాళం ఇచ్చారు.
Also Read: తగ్గాల్సిన టైమ్‌లో పెంచేసిన పూజా హెగ్డే!
అలాగే మిగిలిన హీరోలు కూడా భారీ విరాళాలు ఇచ్చారు. కానీ పేరు మాత్రం మెగాస్టార్ కే పోయింది. దాంతో బాలయ్య తనకు కూడా అలాంటి పేరు రావాలనే ఉద్దేశ్యంతోనే ఇప్పుడు ఈ మందుల కకార్యక్రమాన్ని చేపట్టారట. మొత్తానికి మెగాస్టార్ పేరు చూసి బాలయ్య ఇలా చేయడం విశేషమే. సరే.. ఎవరు ఉద్దేశ్యాలు ఏమయితే ఏం.. కష్టాల్లో ఉన్న కార్మికులు బాగుపడుతున్నారు. ఇలాగే ప్రతి హీరో పర్సనల్ గా కూడా సినీ కార్మికులకు ఏదైనా చేస్తే బాగుంటుంది. ఇక బాలయ్య అంటేనే యాక్షన్, కానీ బాలయ్య సినిమాలు మారబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బాలయ్య మారాడు. తన సినిమాల కథల విషయంలో ముఖ్యంగా తన సినిమాలోని యాక్షన్ విషయంలో బాలయ్య జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
Also Read: పూజా హెగ్డే రెచ్చగొడుతున్నా పట్టించుకోని అఖిల్
అందుకే ఇక నుండి తను చేయబోయే సినిమాల్లో కొత్తదనం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న సినిమాలో కూడా కొత్తదనం ఉండబోతుందట. మెయిన్ గా పాత్రలో వైవిధ్యంతో పాటు, కొత్త తరహా కథల్లో నటించాలని గతంలో తానూ అలాంటి కథల్లోనే నటించానని.. కానీ గత ఇరవై ఏళ్లుగా యాక్షన్ కథలకే పరిమితం అయ్యాననే బాధ బాలయ్యలో ఎక్కువ ఉందట, అందుకే కాస్త కొత్తదనం కోసం బాలయ్య ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఏమైనా ఈ తరం యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షుకులను ఆకట్టుకోవాలంటే బాలయ్య కొత్తదనాన్ని నమ్ముకోవడమే ఉత్తమం.