తెలంగాణ సీఎం రేసులో కొత్త పేరు.. ఎవరంటే?

14ఏళ్ల టీఆర్ఎస్ పోరాటం ఫలితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమ సారథిగా కేసీఆర్ ముందుండి పోరాటాన్ని సాగించారు. చావు అంచులదాకా వెళ్లి తెలంగాణను సాధించిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడంతో సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణను ప్రగతిలో పథంలోకి నడిపించారు. ఆయన పాలన ఐదేళ్ల పూర్తికాకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లి బంపర్ మెజార్టీ సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చారు. […]

Written By: Neelambaram, Updated On : July 9, 2020 4:51 pm
Follow us on


14ఏళ్ల టీఆర్ఎస్ పోరాటం ఫలితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమ సారథిగా కేసీఆర్ ముందుండి పోరాటాన్ని సాగించారు. చావు అంచులదాకా వెళ్లి తెలంగాణను సాధించిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడంతో సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణను ప్రగతిలో పథంలోకి నడిపించారు. ఆయన పాలన ఐదేళ్ల పూర్తికాకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లి బంపర్ మెజార్టీ సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ ముందుచూపుతోనే టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిందని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతుంటాయి.

కొత్త సచివాలయ నిర్మాణానికి కారణాలు ఇవేనా!

సీఎం కేసీఆర్ వయస్సు పైబడిన ఆయనకు ఆరోగ్యం సహకరించడం లేదనే వాదనలు ఉన్నాయి. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేటీఆర్ ను ప్రకటించి ఆయన విశ్రాంతి తీసుకుంటారని ప్రచారం జరిగింది. దీంతోపాటు కేసీఆర్ కు జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు గతంలో అనేకసార్లు మీడియా ముఖంగా చెప్పారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను కేసీఆర్ నియమించారని అప్పట్లో ప్రచారం జరిగింది. కేటీఆర్ తో సన్నిహితంగా ఉన్న నేతలకే కేసీఆర్ మంత్రివర్గంలో చోటుదక్కడంతో కేటీఆరే కాబోయే సీఎం అంటూ ప్రచారం జరిగింది.

టీఆర్ఎస్ ఇలాంటి ప్రచారం జోరుగా జరుగుతుండటంతో సీఎం కేసీఆర్ కూడా దీనిపై స్పందించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని.. మీకు బాగోలేకపోతే చెప్పండి.. దిగుతానని కామెంట్ చేశారు. తాను బేషుగ్గానే ఉన్నానని సీఎంగా తానే కొనసాగుతానని తనదైన శైలిలో ఆ ప్రచారానికి చెక్ పెట్టారు. దీంతో కొంతకాలంగా సీఎం రేసులో కేటీఆర్ పేరు విన్పించకుండా పోయింది. తాజాగా సీఎం రేసులో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఉన్నారంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

కరోనా టైంలో రేవంత్ కు ఛాన్స్ దొరికిందా?

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ సీఎం కేసీఆర్ ఎక్కడ అంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ హైదరాబాద్లో కాకుండా ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్ లో ఉండటంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎంపీ అరవింద్ ‘పట్టాభిషేకం సంతో ష్ కా కేటీఆర్ కా? అంటూ సోషల్ మీడియాలో పోస్టుపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఒక్కసారిగా సంతోష్ పేరు తెరమీదకు వచ్చింది. దీంతో సంతోష్ కుమార్ గురించి తెలుసుకునేందుకు పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు.

సీఎం కేసీఆర్ కు సంతోష్ వరసకు కొడుకు అవుతాడని సమాచారం. కేసీఆర్ పీఏగా ప్రస్థానం ప్రారంభించిన సంతోష్ అనతీకాలంలోనే పార్టీలో ప్రధాన కార్యదర్శి వరకు ఎదిగారని తెలుస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. కెసిఆర్ తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ సంతోష్ ఉంటారని వినికిడి. సీఎం ఢిల్లీకి వెళ్లినా వెంట సంతోష్ ఉండాల్సిందేనని అంటుంటారు. టీఆర్ఎస్ నెంబర్ 2గా కొనసాగుతున్న కేటీఆర్ ను పక్కన పెట్టి సంతోష్ కు సీఎం పదవీ కట్టబెడుతారా? అనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. ఎంపీ అరవింద్ రేపినకాక టీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. తెలంగాణలో మరోసారి సీఎం రేసు మొదలవడం ఆసక్తిని రేపుతుంది.