Homeఎంటర్టైన్మెంట్అమ్మ ఆర్జీవీ .. అంకితను అప్సర చేసేశావుగా..

అమ్మ ఆర్జీవీ .. అంకితను అప్సర చేసేశావుగా..


కంటెంట్‌ లేని చిత్రాలు తీసి, ట్రైలర్తో హీట్‌ పెంచి అసలు సినిమాలతో ఉసూరుమనిపించడంలో సెన్సేషనల్‌ డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మ ముందుంటాడు. తాను పరిచయం చేసే నటీనటుల విషయంలోనూ వర్మ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఒక్కోసారి పిచ్చోళ్లను చేస్తుంటాడు. తన తాజా చిత్రం ‘థ్రిల్లర్’ సినిమాతో అప్సర రాణి అనే ఏంజల్‌ని పరిచయం చేస్తున్నానని వర్మ ఈ మధ్యే సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. చూడ్డానికి నిజంగా అప్సరసలా ఉన్న ఆ అమ్మాయి హాట్‌ హాట్‌ ఫొటోలనూ వదిలాడు. ఆమె బుగ్గపై ముద్దు పెడుతున్న ఫొటో, సెట్‌లో ఆమెతో కలిసి డిన్నర్ చేస్తున్న ఫొటోనూ కూడా బయటపెట్టాడు. ఆమె ఒడిశాలో పుట్టి, డెహ్రాడూన్‌లో పెరిగి.. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటుందని. ఆమె మంచి నటి, అద్భుతమైన డ్యాన్సర్ అని చెప్పాడు. ‘అప్సర రాణిని కలవడానికి ముందు నాకు ఒడిశా గురించి ఏమీ తెలియదని, ఆ రాష్ట్రం అంటే ఇప్పటి వరకు తెలిసింది 1999లో వచ్చిన హరికేన్ మాత్రమే. కానీ, అప్సరని కలిసిన తర్వాత ఒడిశా అన్ని రకాల హరికేన్‌లను సృష్టంచిందని తెలుసుకున్నా. ఒడిశాలో ఇంత అందం దాగి ఉందని నాకిప్పుడే… అంటే అప్సరను కలిసిన తర్వాత తెలిసింది. ఈ బ్యూటీనే ఇప్పుడు ఒడిశాకు మరింత బలం’ తన దైన శైలిలో యువ నటిపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు చేశాడు.

ట్రెడిషినల్ బ్యూటీ హాట్ హాట్ సీన్స్ కి సై ?

అప్సరను తానే ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నానని చెప్పాడు. కానీ, అది అబద్దం. ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. తెలుగులో ‘4 లెటర్స్‌’, ‘ఉల్లాల ఉల్లాల’ చిత్రాల్లో ఓ హీరోయిన్‌గా నటించింది. పైగా ఆమె పేరు అప్సర రాణి కాదు. అంకిత మహారాణా. ఆమె పేరు గూగుల్‌ చేస్తే వర్మ ఫొటో షూట్‌ కంటే ఎక్కువ హాట్‌ ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏంటంటే.. అప్సర రాణి.. అలియాస్‌ అంకితను వర్మ ఇది వరకే ఓ లైవ్‌ ఈవెంట్‌లో కలిశాడు. దాన్ని చాలా మంది చూశారు. నటుడు సత్య ప్రకాశ్‌ డైరెక్టర్గా తీసిన‘ఉల్లాల ఉల్లాల’ ఆడియో ఫంక్షన్‌లోనే అంకితను ఆర్జీవీ చూశాడు. ఆమె చాలా అందంగా ఉందంటూ స్టేజ్‌పైనే చెప్పిన అతను.. సినిమా చాన్సిస్తానని ఆమెకు మాటిచ్చాడు. ఈ విషయాన్ని అంకితనే ఇది వరకు పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. తన బాడీని మరింత సెక్సీగా మార్చుకొమ్మన్నాడని వెల్లడించింది. సో, మాటిచ్చినట్టే అంకితకు ఆర్జీవీ చాన్స్‌ ఇచ్చాడు. కానీ, ఎవరికీ తెలియని నటిని తానే ఒడిశా నుంచి తీసుకువచ్చి పరిచయం చేస్తున్నానంటూ గొప్పలు చెప్పుకున్నాడు. అంకిత కూడా అప్సర రాణితో ఈ మధ్యే ట్విట్టర్ అకౌంట్‌ ఓపెన్‌ చేసింది. ఇది కూడా ఆర్జీవీ ప్లానే అయి ఉంటుంది. ఏదేమైనా అంకితను అప్సరను చేసిన రాము బాగానే నమ్మించే ప్రయత్నం చేశాడు గానీ.. గూగుల్‌ తల్లి సాయంతో నెటిజన్లు అసలు విషయం బయట పెట్టారు.

క్రియేటివ్ డైరెక్టర్ కి క్రియేటివిటీ ఉందా ?

Ullala Ullala Movie Official Trailer | Nishanth | Noorin Shereef | Anketa Maharana | News Buzz

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version