ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతోందని ఒకపక్క వైసిపి నాయకులు డప్పు కొట్టుకుంటున్నారు. కరోనా మహమ్మారి పంజా విసురుతున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయిన సమయంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని గొప్పలకు పోతున్నారు. ఇటువైపు టిడిపి మాత్రం అదే స్థాయిలో వారిపై బురదజల్లే కార్యక్రమం కూడా పెట్టుకుంటోంది. కొన్ని సరైన విమర్శలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం చాలా ఖచ్చితంగా వారిని టార్గెట్ చేసి ఎటువంటి ప్రూఫ్ లేకుండా మాట్లాడుతున్నట్లు ఉంటాయి. ఇక గంటకు 9 కోట్లు అప్పు చేస్తూ జగన్ రాష్ట్రాన్ని అప్పుల చేస్తున్నారని చంద్రబాబు ఇటీవల విమర్శించారు. అటు వైపు చూస్తే ప్రజా సంక్షేమ పథకాలకు టిడిపి అడ్డుపడుతోంది అని వైసీపీ వారు అంటున్నారు.
ఇలాంటి దశలో ఏ క్షణంలో అయినా ఎన్నికలు వస్తాయని…. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని టిడిపి అధిష్టానం తమ శ్రేణులకు పిలుపునిచ్చింది. దానికి వైసిపి వారు కూడా కౌంటర్ వేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం కావడం కల అని…. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిడిపికి మరోసారి ఘోర పరాభవం తప్పదని మంత్రి కొడాలి నాని అంటున్నారు.
ఒక పక్కేమో జగన్ పాలనలో అసమర్ధత పూర్తిగా తేటతెల్లమైపోయింది. రాష్ట్ర ప్రతిష్ట వైసీపీ పాలనలో దిగజారిపోయిందని చంద్రబాబు పదేపదే విమర్శిస్తున్నాడు. 15 నెలల పాలన లో జగన్ ప్రభుత్వం రెండు సార్లు కరెంటు చార్జీలు పెంచేసి రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని అన్నారు. ఉచిత విద్యుత్తు కి నగదు బదిలీ పథకాన్ని అడ్డుకుంటామని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల పొలాల్లో స్మార్ట్ మీటర్లు నిర్ణయాన్ని తప్పుపట్టారు. దీనివల్ల మెట్ట ప్రాంత, రాయలసీమ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.
అయితే మొత్తానికి జగన్ కు పాలించడం చేత కాలేదని…. త్వరలోనే ఎన్నికలు ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే ఎన్నికల లేనప్పుడే జరుగుతున్న ఈ వింత రాజకీయం ఏపీ ప్రజలు ఓర్వలేకపోతున్నారు. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాష్ట్రం అభివృద్ధిని గాలికి వదిలేసిన పక్షంలో మరో ప్రత్యామ్నాయం వైపు చూసేందుకు ఏపీ ప్రజలకు ఇంకా సమయం పడుతుంది.
ఈ క్రమంలో మళ్లీ ఎన్నికలు…. ఎన్నికలు…. అంటూ ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. అటు ఎవరూ కూడా ఈ రెండు పార్టీల పనితీరు పట్ల ఏమాత్రం సంతోషంగా లేరు. ఇలాంటి సమయంలో ఎన్నికలు తెస్తాము అని ప్రతిపక్షం… మేము రెడీ అని అధికార పక్షం బీరాలకు పోతున్న నేపథ్యంలో…. రియాల్టీ ఎలా ఉన్నా…. అసలు వీరి సర్కస్ చూస్తుంటే… రాజకీయం అనే పదం మీద ప్రజలకు మరింత విరక్తి కలిగేలా ఉంది.