New Guidelines: ఒకటో తేదీ వచ్చింది అంటే చాలు ఎన్నో విషయాలలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అలాగే కొత్త కొత్త నిబంధనలు కూడా వస్తుంటాయి.ఈ క్రమంలోనే నవంబర్ నెలలో పలు శాఖలో మార్పులు చోటుచేసుకుని సరికొత్త నిబంధనలను అమలు చేయనున్నారు. మరి నవంబర్ నెల నేటి నుంచి ప్రారంభం కాగా నేటి నుంచి ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
బ్యాంకు లావాదేవీలలో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా లావాదేవీలలో మార్పులు రానున్నాయి. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో నెలకు పరిమితమైన ట్రాన్సాక్షన్ కన్నా అధికంగా జరిగితే వినియోగదారులపై అధిక చార్జీలు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. విత్ డ్రా, సేవింగ్స్, శాలరీ అకౌంట్స్ అన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. ఇక ఒకటవ తేదీ నుంచి పలు ప్యాసింజర్ రైళ్లు సమయాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా పాత వర్షన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో ఒకటవ తేదీనుంచి వాట్సప్ సేవలు పూర్తిగా ముగిసిపోతాయి.