https://oktelugu.com/

Rajini Kanth: కోలుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్…ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

Rajini Kanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సూపర్ స్టార్ రజినీకాంత్  కొన్ని రోజుల క్రితం స్వల్ప అస్వస్థతతో తమిళనాడు చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో జాయిన్ అయిన రజినీకాంత్ కోలుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. రజనీకాంత్‌ అభిమానులకు శుభవార్త.. ఇటీవల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ డిశ్చార్జి అయ్యారు. వైద్యుల సూచనల మేరకు ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు ఆయనను ఇంటికి తీసుకెళ్లారు. అయితే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 1, 2021 / 12:15 PM IST
    Follow us on

    Rajini Kanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సూపర్ స్టార్ రజినీకాంత్  కొన్ని రోజుల క్రితం స్వల్ప అస్వస్థతతో తమిళనాడు చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో జాయిన్ అయిన రజినీకాంత్ కోలుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. రజనీకాంత్‌ అభిమానులకు శుభవార్త.. ఇటీవల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ డిశ్చార్జి అయ్యారు. వైద్యుల సూచనల మేరకు ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు ఆయనను ఇంటికి తీసుకెళ్లారు.

    అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రి నుంచి బయటకు రావడానికి ముందే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ సూపర్‌స్టార్‌ రజినీకాంత్  ని పరామర్శించారు. స్టాలిన్‌… రజనీ బాగోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.  త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

    సినీ కళామతల్లికి సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన సేవలను గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారంతో గౌరవించిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి వచ్చిన తరువాత తన ఫ్యామిలీతో కలిసి ‘అన్నాత్తే’ సినిమాను చూశారు. అయితే ఆ వెంటనే అస్వస్థతకు గురైన సూపర్‌ స్టార్‌ను ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో తమ అభిమాన నటుడికి ఏమైందోనని ఫ్యాన్స్‌ ఆందోళన చెందారు. రజనీకాంత్‌ మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌ గుర్తించామని, అందుకు సరైన చికిత్స చేశామని వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రజినీకాంత్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడంతో ఆయన అభిమానులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.