కరోనా టెస్ట్ రిపోర్ట్ కు ఆరు గంటలు

ప్రస్తుతం ప్రస్తుతం కరోనా టెస్ట్ రిపోర్ట్ రావడానికి ఆరు గంటల సమయం పడుతోందని ముఖ్యమంత్రి అదనపు ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేష్ తెలిపారు. రాష్ట్రంలో వెంటిలేటర్ల మీద ఉన్న పేషేంట్స్ ముగ్గురు మాత్రమేనాని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు 900 వెంటిలేటర్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 6 కరోనా టెస్టింగ్ ల్యాబ్ లను, అన్ని జిల్లాలో మరో 10 రోజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కర్నూలు, నెల్లూరు జిల్లాలపై […]

Written By: Neelambaram, Updated On : April 7, 2020 11:17 am
Follow us on


ప్రస్తుతం ప్రస్తుతం కరోనా టెస్ట్ రిపోర్ట్ రావడానికి ఆరు గంటల సమయం పడుతోందని ముఖ్యమంత్రి అదనపు ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేష్ తెలిపారు. రాష్ట్రంలో వెంటిలేటర్ల మీద ఉన్న పేషేంట్స్ ముగ్గురు మాత్రమేనాని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు 900 వెంటిలేటర్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న 6 కరోనా టెస్టింగ్ ల్యాబ్ లను, అన్ని జిల్లాలో మరో 10 రోజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కర్నూలు, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని తెలిపారు. కరోనా పరీక్షలకు పడుతున్న సమయాన్ని తగ్గించి గంటన్నరలో టెస్ట్ ఫలితాలు వచ్చే కిట్ల కొనుగోలుకి సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. పదిరోజుల్లో ఇలాంటి 3 లక్షల కిట్లు వచ్చేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రులు అత్యవసర సేవలు ఆపేయాలని ఎలాంటి అదేశాలు లేవని స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అలా చేస్తున్నాయి, దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని కోరారు.