సూర్యాపేటలో సీన్ మారింది!

కొద్ది రోజుల క్రితం సూర్యాపేటలో కరోనా కేసులు ఊహించని రీతిలో పెరగడంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆ జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని జిల్లా యంత్రాంగం పేర్కొంది.గత వారం రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ మేరకు అధికారులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 83 పాజిటివ్ కేసులు నమోదవగా, 75 యాక్టీవ్ కేసులు ఉన్నాయని […]

Written By: Neelambaram, Updated On : April 29, 2020 7:16 pm
Follow us on

కొద్ది రోజుల క్రితం సూర్యాపేటలో కరోనా కేసులు ఊహించని రీతిలో పెరగడంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆ జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని జిల్లా యంత్రాంగం పేర్కొంది.గత వారం రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ మేరకు అధికారులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 83 పాజిటివ్ కేసులు నమోదవగా, 75 యాక్టీవ్ కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. బుధవారం నాడు మరో ఇద్దరు డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 8 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు ప్రకటించారు. కాగా, 4551 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు.

గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సూర్యాపేటలో అంతకంతకూ కరోనా కేసులు పెరిగిన తీరు అధికార యంత్రాంగాన్ని కంగారెత్తించింది. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. సూర్యాపేటలో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. లాక్‌ డౌన్ నిబంధనలను పకడ్బందీగా అమలు జరిపింది. కరోనా చైన్ సిస్టమ్‌ ను బ్లాక్ చేసింది. దీంతో సూర్యాపేటలో కరోనా వ్యాప్తి దాదాపుగా నిలిచిపోయింది. తాజాగా గడిచిన వారం రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.