https://oktelugu.com/

పక్కా కామెడీ చేయబోతున్న రవితేజ !

హీరో రవితేజకు ముందు నుంచి ఉన్న అలవాటు స్పీడ్ గా సినిమాలు చేయడం.. ప్రతి మూడు నెలలకు ఒక సినిమా చేసిన హిస్టరీ రవితేజది. ఈ జనరేషన్ లో రవితేజ అంత స్పీడ్ గా సినిమాలు చేసిన హీరోనే లేడు. ఆ మధ్య అల్లరి నరేష్ పోటీ ఇచ్చినా.. చివరకు అల్లరి నరేష్ ప్రస్తుతం సోలో హీరోగా నిలబడటమే కష్టం అయిపొయింది. ఏది ఏమైనా టాలీవుడ్ లో స్పీడ్ గా సినిమాలు చేసే హీరోల లిస్ట్ లో […]

Written By:
  • admin
  • , Updated On : December 9, 2020 / 02:29 PM IST
    Follow us on


    హీరో రవితేజకు ముందు నుంచి ఉన్న అలవాటు స్పీడ్ గా సినిమాలు చేయడం.. ప్రతి మూడు నెలలకు ఒక సినిమా చేసిన హిస్టరీ రవితేజది. ఈ జనరేషన్ లో రవితేజ అంత స్పీడ్ గా సినిమాలు చేసిన హీరోనే లేడు. ఆ మధ్య అల్లరి నరేష్ పోటీ ఇచ్చినా.. చివరకు అల్లరి నరేష్ ప్రస్తుతం సోలో హీరోగా నిలబడటమే కష్టం అయిపొయింది. ఏది ఏమైనా టాలీవుడ్ లో స్పీడ్ గా సినిమాలు చేసే హీరోల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ మాస్ మహరాజా రవితేజదే. ఐతే గత ఎనిమిదేళ్ల నుండి రవితేజకు సాలిడ్ హిట్ లేకపోయినా వరుస సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు.

    Also Read: ‘స‌ర్కారు వారి పాట’‌.. క‌థ‌లో కీల‌క‌మైన మార్పులు !

    ఈ క్రమంలో రచయిత కోన వెంకట్ రాసిన కథతో, దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో రవితేజ ఓ కొత్త సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రానుందని, ముఖ్యంగా సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ ఫుల్ కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో రవితేజ భార్యా బాధితుడిగా కనిపించబోతున్నాడని.. మన చట్టాల్లోని స్త్రీలకు అనుగుణంగా ఉన్న చట్టాలతో రవితేజ పాత్ర ఎన్ని ఇబ్బందులు పడిందో ఫుల్ కామెడీగా చూపించబోతున్నారని.. కాగా ఈ సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

    Also Read: నిహారిక పెళ్ళిలో రచ్చ చేసిన మెగా అండ్ అల్లు దంపతులు !

    రవితేజ నుండి ఇలాంటి సినిమా అంటే.. కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు. పైగా రవితేజ భార్య బాధితుడిగా అదీ ఫుల్ కామెడీతో అంటే సినిమా పై బాగానే ఆసక్తి ఉంటుంది. మొత్తానికి ఈ సారి రవితేజ ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించబోతున్నాడు అన్నమాట. అన్నట్లు రవితేజ మరో కామెడీ సినిమాని కూడా చేస్తున్నాడు. త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలో ఆ సినిమా రానుంది. నక్కిన ఎలాగూ కామెడీని బాగా హ్యాండిల్ చేస్తారు. ఆయన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి కామెడి సినిమాల్లో ఎంటెర్టైమెంట్ బాగా పేలింది. ఆ రకంగా ఇప్పుడు రవితేజ చేయబోయే సినిమాలు పక్కా కామెడీతో రాబోతున్నాయి అన్నమాట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్