Perni Nani: ఏపీలో పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ మూవీ చుట్టూ ఇప్పుడు రాజకీయం నడుస్తోంది. చంద్రబాబు, లోకేష్ లు సినిమాను తొక్కేస్తున్నారని జగన్ ప్రభుత్వంపై మండిపడడంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి పేర్ని నాని లాజిక్ తో కొట్టాడు. ‘భీమ్లానాయక్’ మూవీ వివాదాన్ని పెద్దది చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. మరోవైపు ఏపీ మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ లకు భయపడమంటూ స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ సినిమాను తొక్కేయడం ఏంటని మంత్రి పేర్ని నాని కాస్త గట్టిగానే ప్రశ్నించారు. సినిమాను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీలో సినిమా టికెట్ ధరలపై చంద్రబాబు, లోకేష్ లు స్పందించడంపై మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు సినిమాలను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఒక సినిమా రిలీజ్ ఉంటే దాని కోసం తండ్రి, కొడుకులు, పిల్లిమొగ్గలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. సినిమా టికెట్ ధరలను అధికంగా అమ్మకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
బ్లాక్ మార్కెట్ ను అరికట్టాల్సిన వారే ప్రోత్సహిస్తున్నారని.. సొంత బావమరిది శవం పక్కన రాజకీయాలు మాట్లాడింది ఎవరంటూ ప్రశ్నించారు. టీడీపీ జెండాను మోసిన జూ.ఎన్టీఆర్ సినిమాను ఏనాడైనా చంద్రబాబు, లోకేష్ పట్టించుకున్నారా? అంటూ గౌతం రెడ్డి ప్రశ్నించారు.
మంత్రి గౌతం రెడ్డి చనిపోయిన బాధలో మేమున్నామని.. జీవో రావడం రెండు రోజులు ఆలస్యమైందని రచ్చ చేస్తున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. ప్రభాస్, మహేష్, చిరంజీవి సినిమాలకు ఎప్పుడైనా చంద్రబాబు ట్వీట్ చేశారా? అని ప్రశ్నించారు. మరి ఇప్పుడు పవన్ సినిమా చూడాలంటే ఎలా లోకేష్ ట్వీట్ చేస్తారని మండిపడ్డారు. మేము ఇలాంటి రాజకీయాలను చూసి సిగ్గుపడుతున్నామని పేర్ని నాని చెప్పారు.
Also Read: భీమ్లానాయక్ రాజకీయం.. కేసీఆర్ అలా.. జగన్ ఇలా.. ఏంటీ రచ్చ..?
Adi attaga dengu pic.twitter.com/ZAge1CJPMr
— TwoodThalaiva (@tollywoodtaliva) February 25, 2022
సినిమా బాగుంటే ఎవరు హీరో అయినా చూస్తారని.. నాగార్జున తనయుడు నాగచైతన్య తీసిన రెండు సినిమాలు బాగున్నాయి కనుక ప్రేక్షకులు ఆదరించారన్నారు. సినిమాలో దమ్ముంటే బాగా ఆడుతాయన్నారు. లేదంటే మరో అజ్ఞాతవాసి అవుతందంటూ వ్యాఖ్యానించారు.
24వ తేదీన జీవో రావాల్సిఉంది.. కానీ మంత్రి గౌతంరెడ్డి మృతితో ఆలస్యమైంది
-మంత్రి పేర్ని నాని గారు pic.twitter.com/L8zyBkUPjD
— 2024YSRCP (@2024YSRCP) February 25, 2022
అఖండ సినిమా రిలీజ్ సయమంలో బాలకృష్ణ కలవడానికి కొంతమందిని పంపించారని.. జగన్ అపాయింట్ మెంట్ ఇప్పించమన్నారని.. అది అబద్దమైతే ఆయన్ని చెప్పమని చెప్పండని.. బాలకృష్ణ అబద్దాలు ఆడుతారా? అని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబువి దిక్కుమాలిన రాజకీయాలు అంటూ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.
Also Read: నియంతలా వ్యవహరిస్తున్న పుతిన్.. అగ్రరాజ్యాల హెచ్చరికలు బేఖాతరు