Alliance In AP: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎటు వైపు తిరుగుతాయో అర్థం కావడం లేదు. పొత్తుల కోసం ఎత్తులు వేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీని నిలువరించాలంటే విపక్షాలన్ని ఏకం కావాల్సిన అవసరం ఉందని గుర్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులు ఎవరి మధ్య ఉంటాయనే సందేహం వస్తోంది. పొత్తుల మీదే ఫలితాలు ఉంటుందని తెలుస్తోంది. దీంతో టీడీపీ జనసేన వైపు చూస్తోంది. పవన్ కల్యాణ్ తో జతకట్టాలని భావిస్తోంది. బీజేపీతో దోస్తీ కారణంగా టీడీపీ ఆశ నెరవేరుతుందో లేదో తేలాల్సి ఉంది.

కేంద్రం పెట్రోధరలు తగ్గించడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. సామాన్యుడికి ఊరడింపుగా ధరలు తగ్గించడంపై హర్షం వ్యక్తం చేశారు. వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కేంద్రం ధరలు తగ్గించడంపై వాహనదారులపై పెనుభారం మోపకుండా చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో టీడీపీ కూడా బీజేపీతో జతకట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: JanaSena Alone Fight: జనసేన ఒంటరి పోరుకు నాగబాబు స్కెచ్.. ఆయన వెనుక ఎవరున్నారు?
కేంద్రం తగ్గించిన ధరలకు రాజస్తాన్, ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలు దిగివచ్చి ధరలు తగ్గించినా ఏపీ సీఎం మాత్రం ససేమిరా అంటున్నారు. దీంతో ప్రజలపై భారం పడుతోంది. వైసీపీ ప్రభుత్వ తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా జగన్ మాత్రం చోద్యం చూస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎదురు దెబ్బలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండాలని పవన్ కల్యాణ్ ఇదివరకే ప్రకటించడంతో ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో పొత్తుకు తాను ప్రయత్నిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇదివరకు పవన్ సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతోనే రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఖాయమనే వాదనలు కూడా వస్తున్నాయి. దీంతో వైసీపీని ఎదుర్కొనేందుకు మూడు పార్టీలు కలుస్తాయా? అనే సందేహాలు మాత్రం వస్తున్నాయి.
Also Read:Vijay Sai Reddy Impress Delhi BJP: బీజేపీ అగ్ర నాయకత్వం ప్రాపకం కోసం పరితపిస్తున్న విజయసాయిరెడ్డి
Recommended videos



[…] Also Read: Alliance In AP: ఆంధ్రప్రదేశ్ లో మారనున్న పొత్త… […]