Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu-Trivikram: 'మహేష్ – త్రివిక్రమ్' సినిమాకి అదిరిపోయే టైటిల్.. మళ్లీ అదే టైటిల్...

Mahesh Babu-Trivikram: ‘మహేష్ – త్రివిక్రమ్’ సినిమాకి అదిరిపోయే టైటిల్.. మళ్లీ అదే టైటిల్ ?

Mahesh Babu-Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌ లో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అతడు సినిమాలోని హీరో రోల్ ‘పార్థు’ను ఇప్పుడు చేస్తున్న సినిమాకి టైటిల్‌గా ఖరారు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ ‘అర్జునుడు’ అంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Mahesh Babu-Trivikram
Mahesh Babu-Trivikram

అయితే అర్జున్ అని గతంలో మహేష్ ఒక సినిమా చేసాడు. అది ప్లాప్ అయ్యింది. మరి ఈ సినిమాకి నిజంగానే ‘అర్జునుడు’ అని పెడతారో లేదో చూడాలి. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జులైలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా యాక్ట్ చేయబోతుంది. అలాగే హీరోయిన్ సాయి పల్లవి మహేష్ సిస్టర్ గా నటించబోతుందట.

Also Read: Vijay Sai Reddy Impress Delhi BJP: బీజేపీ అగ్ర నాయకత్వం ప్రాపకం కోసం పరితపిస్తున్న విజయసాయిరెడ్డి

ఇక ఈ సినిమా పై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఫ్యాన్స్ ను సంతృప్తిపరచడానికి త్రివిక్రమ్ అన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తోంది. దాంతో భారీ సీన్స్ రాయాల్సి వస్తోంది. సహజంగా త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో తన అభిరుచికి తగ్గట్టు కచ్చితంగా ఓ భారీ ఫైట్ ను డిజైన్ చేస్తాడు. గమనిస్తే.. త్రివిక్రమ్ ప్రతి సినిమాలో ఓ ప్రత్యేక ఫైట్ సీన్ ఉంటుంది.

పైగా ఆ సీన్స్ అన్నీ ట్రాఫిక్ తో పాటు చిన్నపాటి గ్రాఫిక్స్ ను మిక్స్ చేసి ఉంటాయి. ఇప్పుడు మహేష్ సినిమా కోసం కూడా త్రివిక్రమ్ ఇదే తరహా ఫైట్ ను ప్లాన్ చేశాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీసుకురాబోతున్నారు కాబట్టి.. ఈ సినిమాలో కూడా పాన్ ఇండియా స్టార్స్ ను తీసుకుంటున్నారు. దాంతో బడ్జెట్ అనుకున్న దాని కంటే రెండింతలు పెరిగింది.

Mahesh Babu-Trivikram
Mahesh Babu-Trivikram

మరోపక్క డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పటి నుంచే త్రివిక్రమ్ పై ఒత్తిడి పెంచుతున్నారు. సినిమాలో ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి అంటూ డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్ చేస్తున్నారు. అన్నట్టు ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారని, అలాగే పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యాన్ని కూడా చూపిస్తారట.

అదేవిధంగా ఓ సామాజిక అంశాన్ని కూడా సినిమాలో ప్రముఖంగా ప్రస్తావించబోతున్నారని తెలుస్తోంది. హారికా హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో ఈ సినిమా రాబోతుంది.

Also Read:JanaSena Alone Fight: జనసేన ఒంటరి పోరుకు నాగబాబు స్కెచ్.. ఆయన వెనుక ఎవరున్నారు?
Recommended videos
RRR Dosthi పాటకు  పవన్ కళ్యాణ్ కొడుకు మ్యూజిక్ అదరకొట్టాడు || Akira Nandan Playing RRR Dosti SONG
HILARIOUS Video Ever | F3 Team Reels Imitation At F3 Pre Release Event | Hero Venkatesh | Varun Tej
Rakul Preet Singh With SUPER Cool Looks with Boyfriend || Rakul Preet Boy Friend Jackyy Bhagnani

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version