రఘురామకు మళ్లీ షాకిచ్చిన నెటిజన్లు

బెయిల్ పై విడుదలైన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇటీవల జగన్ సర్కారుకు వరుస లేఖలు రాస్తున్నారు. దీనిపై సృజనాత్మకత సెటైర్లతో నెటిజన్లు చెడుగుడు ఆడుతున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుకు డీఏ,పీఆర్సీ వెంటనే ఇవ్వాలని ఎంపీ రఘురామ కోరారు. ఈమేరకు లేఖ రాశారు. ఇది సీఎంకు రాసిన ఆరో లేఖ. వారికి న్యాయం చేయాలని కోరారు. హామీలపై లేఖలు రాయడం మంచిదే. ఇందుకు రఘురామ కృష్ణంరాజును అభినందించాల్సిందే. రఘురామ కృష్ణంరాజుకు సంబంధించి నెటిజన్లకు ఏవేవో గుర్తుకు తెచ్చాయి. […]

Written By: Srinivas, Updated On : June 15, 2021 4:52 pm
Follow us on

బెయిల్ పై విడుదలైన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇటీవల జగన్ సర్కారుకు వరుస లేఖలు రాస్తున్నారు. దీనిపై సృజనాత్మకత సెటైర్లతో నెటిజన్లు చెడుగుడు ఆడుతున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుకు డీఏ,పీఆర్సీ వెంటనే ఇవ్వాలని ఎంపీ రఘురామ కోరారు. ఈమేరకు లేఖ రాశారు. ఇది సీఎంకు రాసిన ఆరో లేఖ. వారికి న్యాయం చేయాలని కోరారు. హామీలపై లేఖలు రాయడం మంచిదే. ఇందుకు రఘురామ కృష్ణంరాజును అభినందించాల్సిందే.

రఘురామ కృష్ణంరాజుకు సంబంధించి నెటిజన్లకు ఏవేవో గుర్తుకు తెచ్చాయి. నెటిజన్లు రఘురామ కృష్ణంరాజుకు ప్రశ్నలు సంధిస్తున్నారు. తమరు బ్యాంకులకు ఎగవేసిన రుణ బకాయిలు చెల్లించాలని కోరారు. జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీను నెరవేరుస్తుందని హితవు పలికారు. ఈసందర్భంగా రఘురామ కృష్ణంరాజు బ్యాంకులకు ఎగవేసిన రుణాలు, సీబీఐకేసు అంశాలను సోషల్ మీడియాలో ప్రస్తావించడం విశేషం.

రఘురామ కృష్ణం రాజు ఆయన కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నఇంద్ భరత్ పవర్ జెన్ కాం లిమిటెడ్ కంపెనీ బ్యాంకులను తీవ్రంగా మోసగించడం, నకిలీ డాక్యుమెంట్ు సమర్పించడం, దాదాపు రూ. 237.84 కోట్ల మేర స్వాహా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్సై శాఖ సీబీఐకి ఫిర్యాదును సోషల్ మీడియా వేదికగా రఘురామకు గుర్తు చేశారు. రఘురామ కృష్ణం రాజ కంపెనీ ఎస్బీఐకి రూ.107.57 కోట్లు, యాక్సిస్ బ్యాంకుకు రూ. 123.65 కోట్లు, సిండికేట్ బ్యాంకుకు రూ.46.05 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.13.95 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు రూ.6.62 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు రఘురామ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు

బ్యాంకులకు ముందు బకాయిలు చెల్లించిన తరువాత జగన్ సర్కారుకు లేఖలు రాయాలని నెటిజన్లు హితవు చెబుతున్నారు. బ్యాంకులుండేది తమలాంటి బడా నేతలు ముంచడానికి కాదు రాజు గారు అని నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు.మరికొందరు నెటిజన్లు తీసుకున్నవి తిరిగి ఇవ్వడం రాజుగారి ఇంటా వంటా లేదని కామెంట్లు పెడుతున్నారు.