https://oktelugu.com/

ఈ ఎస్బీఐ అకౌంట్ తో రూ.2 లక్షల బెనిఫిట్.. ఎలా పొందాలంటే..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కొరకు ఎన్నో రకాల సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ కస్టమర్ల కొరకు అందిస్తున్న సర్వీసులలో బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ సేవలు కూడా ఒకటి. ఎస్బీఐలో పలు రకాల ఖాతాలు ఉండగా ఇందులో . జీరో బ్యాలెన్స్ అకౌంట్లు కూడా ఒకటని చెప్పవచ్చు. ఎస్బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఎస్‌బీఐలో జన్ ధన్ ఖాతా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 15, 2021 / 04:51 PM IST
    Follow us on

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కొరకు ఎన్నో రకాల సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ కస్టమర్ల కొరకు అందిస్తున్న సర్వీసులలో బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ సేవలు కూడా ఒకటి. ఎస్బీఐలో పలు రకాల ఖాతాలు ఉండగా ఇందులో . జీరో బ్యాలెన్స్ అకౌంట్లు కూడా ఒకటని చెప్పవచ్చు. ఎస్బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.

    ఎస్‌బీఐలో జన్ ధన్ ఖాతా తెరవడం వల్ల ఈ అకౌంట్ ఉన్నవాళ్లు ఏకంగా రెండు లక్షల రూపాయల బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రయోజనాన్ని పొందాలంటే ఎస్బీఐ ఈ ఖాతాకు ఇచ్చిన రూపే ఏటీఎం కార్డును కచ్చితంగా వినియోగించాల్సి ఉంటుంది. ప్రమాదానికి ముందు జన్ ధన్ అకౌంట్ కలిగిన వారు 90 రోజుల్లో కచ్చితంగా ఒక్కసారైనా ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌ ను కచ్చితంగా నిర్వహించి ఉండాలి.

    ఆ విధంగా చేస్తే మాత్రమే ఖాతాదారుడు ప్రమాదంలో చనిపోతే ఉచిత ప్రమాద బీమాను వాళ్ల కుటుంబ సభ్యులు పొందగలుగుతారు. అకౌంట్ కలిగిన వారు చనిపోయిన పక్షంలో నామినీ ప్రమాద బీమా డబ్బులను పొందే అవకాశాలు ఉంటాయని సమాచారం. ఆధార్ కార్డు, ఎఫ్ఐఆర్, డెత్ సర్టిఫికెట్, పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఉంటే మాత్రమే క్లెయిమ్ డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుంది.

    ఈ రిపోర్టులను బ్యాంక్ అధికారులకు సమర్పించిన పది రోజుల్లో ఖాతాలో నగదు జమ కావడం జరుగుతుంది. 2022 సంవత్సరం మార్చి నెల 31వ తేదీ వరకు ఈ బెనిఫిట్ అమలులో ఉంటుందని తెలుస్తోంది. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించి ఎస్బీఐ జన్ ధన్ ఖాతాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.