Homeఆంధ్రప్రదేశ్‌Kotamreddy Sridhar Reddy: జగన్ ను వదులకున్నంత ఈజీగా.. కోటంరెడ్డిని వదులుకోలేని ఆ ఇద్దరు.. వైరల్

Kotamreddy Sridhar Reddy: జగన్ ను వదులకున్నంత ఈజీగా.. కోటంరెడ్డిని వదులుకోలేని ఆ ఇద్దరు.. వైరల్

Kotamreddy Sridhar Reddy: మొన్నటివరకూ ఏపీ సీఎం జగన్ కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వీర భక్తుడు. గత రెండుసార్లు టిక్కెట్ ఇచ్చిన సీఎం జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటానని చాలా వేదికలపై ప్రకటించారు. అందుకు అనుగుణంగా వినయ, విధేయతలతో నడుచుకున్నారు. తాను చనిపోతే అంత్యక్రియలకు జగనన్న రావాలన్న భావోద్వేగ మాటలు అన్న సందర్భాలున్నాయి. చివరి వరకూ జగన్ తోనే నడుస్తానని చెప్పుకొచ్చారు. అయితే రాజకీయాల్లో ఇటువంటి భావోద్వేగ మాటలకు ఆయుష్షు తక్కువ. అక్కడ పరస్పర ప్రయోజనాలే తప్ప మరే ఇతర అంశాలకు చోటు ఉండదు. నాయకత్వానికి నచ్చకపోయినా, ఇటు నాయకుడికి నచ్చకపోయినా ఇట్టే అభిప్రాయాలు మారుతుంటాయి. తనను అవమానించిన నోట తానుండలేనని..ఈ సీఎం కాకపోతే మరో సీఎం అంటూ వ్యాఖ్యానించి మరీ బంధాన్ని తెంచుకొని కోటంరెడ్డి జగన్ కు దూరమయ్యారు. బాధపడినట్టు కనిపించినా.. మునపటిలా భావోద్వేగానికి మాత్రం లోనుకాలేదు. పైగా తనను కెలికారని.. తగ్గేదేలే అంటూ గట్టి వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతున్నారు. తనను ప్రోత్సహించిన నాయకుడికి దూరమయ్యే క్రమంలో కోటంరెడ్డి బాధపడలేదు. కానీ కోటంరెడ్డిని విడిచిపెట్టాల్సి రావడంతో వారిద్దరూ మాత్రం చాలా బాధపడ్డారు. కన్నీటిపర్యంతమయ్యారు.

Kotamreddy Sridhar Reddy
Kotamreddy Sridhar Reddy

అయితే కోటంరెడ్డి ఇలా అడ్డం తిరిగేసరికి హైకమాండ్ అప్రమత్తమైంది. కోటంరెడ్డి పోతే మరో రెడ్డి వస్తాడంటూ ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. మాకింకా 15 నెలల సమయం ఉంది. అక్కడ నాయకత్వం తయారుచేసుకునేందుకు ఈ సమయం మాకు చాలంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి తేల్చిచెప్పారు. అంతటితో ఆగకుండా కోటంరెడ్డికి ఉన్న భద్రతను తగ్గించేశారు. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఎంపిక చేసి.. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో పాటు యంత్రాంగం మొత్తం కోటంరెడ్డి కనుసన్నల నుంచి తప్పించి అదాల ప్రభాకరరెడ్డికి ఎండార్స్ చేశారు. అటు పార్టీ నాయకులు, కార్యకర్తలకు అల్టిమేటం ఇచ్చారు. కోటంరెడ్డితో వెళ్లేవారికి పదవులు, పవర్; ఫండ్స్ ఉండవని కట్టడి చేశారు. నలుగురు గన్ మెన్లలో ఇద్దర్ని తగ్గించేశారు.

అయితే మంచి కాక మీద ఉన్న కోటంరెడ్డి ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ప్రకటించారు. తనకు కార్యకర్తలు, నెల్లూరు రూరల్ ప్రజలు అండగా ఉంటారని..మీరిచ్చే భద్రత తనకు అవసరం లేదని ప్రకటించారు,. తన వద్ద మిగిలిన ఇద్దరు గన్ మేన్లను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు చెప్పారు.

Kotamreddy Sridhar Reddy
Kotamreddy Sridhar Reddy

మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ విషయాన్ని ప్రకటించారు. ఇది తాను ఊహించిందేనని.. వింటున్నారా సజ్జల రామక్రిష్ణారెడ్డి అంటూ సంభోదించి మరీ నా ఇద్దరి గన్ మేన్లను తీసుకుపోండి కామెంట్స్ చేశారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్. తాను తన అధినేత జగన్ ను వదిలించుకొని బయటకు వచ్చినంత ఈజీగా గన్ మేన్లు కోటంరెడ్డిని విడిచిపెట్టి వెళ్లేందుకు ఇష్టపడలేదు. కోటంరెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సదరు గన్ మేన్లు కన్నీటిపర్యంతమయ్యారు. తాము వెళ్లలేకపోతున్నామని చెప్పడంతో వారిని కోటంరెడ్డిని ఓదార్చారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular