Homeఆంధ్రప్రదేశ్‌ఆత్మరక్షణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ!

ఆత్మరక్షణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ!

కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ ఒక విధంగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం కరోనా వైరస్ ఉదృతి అయ్యే అవకాశం ఉన్నదంటూ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారల పాటు వాయిదా వేస్తే, తామెవ్వరితో సంప్రదించకుండా అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని అంటూ ఒక విధంగా తప్పు పడుతూ రమేష్ కుమార్ కు లేఖ వ్రాసారు.

పైగా, రాష్ట్రంలో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకొంటున్నదని చెప్పుకొచ్చారు. అంతేకాదు మరో మూడు, నాలుగు వరాల వరకు రాష్ట్రంలో ఈ వైరస్ ఉదృతమయ్యే అవకాశం లేదని కూడా ఆమె భరోసా ఇచ్చారు. అందుచేత ఎన్నికల వాయిదా ఆదేశాన్ని ఉపసంహరించుకొని, ముందు అనుకున్న విధంగా ఎన్నికలు జరిపమని ఆమె కోరారు.

అయితే ఆమె విన్నపాన్ని రమేష్ కుమార్ సున్నితంగా తిరస్కరించారు. తనకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ టాస్క్ ఫోర్స్ ను సంప్రదించి, వారి సలహామేరకు వాయిదా వేసిన్నట్లు స్పష్టం చేశారు. వాయిదా నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె పేరుతోనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ కు వెళ్లినా అక్కడ కూడా చుక్కెదురైనది.

మరో మూడు, నాలుగు వారల వరకు రాష్ట్రానికి కరోనా ముప్పు లేదని అంటూ ఆమె లేఖ వ్రాసిన ఒక వారం రోజులకే ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో కలసి దేశ జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం సాయంత్రం చప్పట్లు కొట్టే కార్యక్రమంలో పాల్గొనడాన్ని రాష్ట్ర ప్రజలు అందరు చూసారు. ఆ వెంటనే ఆమె సమక్షంలోనే ఈ నెలాఖరు వరకు రాష్ట్రం అంతా లాక్ డౌన్ అమలు పరుస్తున్నట్లు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

ఈ పరిణామం ఒక విధంగా ఆమెకు అపకీర్తి తీసుకువచ్చిన్నట్లు భావించాలి. మరో కొద్దీ రోజులలో ఉద్యోగ విరమణ చేస్తున్న ఆమె కేవలం రాజకీయ వత్తిడుల కారణంగా, ముఖ్యంగా ముఖ్యమంత్రి `ఆదేశం’తో ఇటువంటి లేఖ వ్రాసారని స్పష్టం అవుతుంది.

ప్రధాన కార్యదర్శిగా వచ్చినప్పటి నుండి ఆమె కొంతమేరకు అసహనంగా కనిపిస్తున్నారు. ఆమెతో సంబంధం లేకుండానే కీలకమైన అంశాలపై ముఖ్యమంత్రి కార్యాలర్యంలోని కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, ప్రధాన కార్యదర్శి జారీ చేయవలసిన జిఓ లను సహితం జారే చేస్తున్నారు.

అమరావతి నుండి విజిలెన్సు, ఎసిబి వంటి కార్యాలయాలను కుర్నూలకు మార్చాలనే జిఓను ప్రవీణ్ ప్రకాష్ జారీచేయడాన్ని హై కోర్ట్ కూడా తప్పు పట్టడం తెలిసిందే.

ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా తక్షణమే సీఎస్ పదవికి రాజీనామా చేయాలని ఆమెకు వ్రాసిన ఒక లేఖలో రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. బాధ్యతాయుత స్థానంలో ఉండి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని విమర్శించారు. స్థానిక ఎన్నికలు నిర్వహించి ఉంటే జనతా కర్ఫ్యూ ఏపీలో జరిగేది కాదన్నారు. కరోనా తీవ్రత పెరిగి ప్రపంచంలో అభాసుపాలయ్యేవాళ్లం అని పేర్కొన్నారు. ఎవరి సలహా ప్రకారం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారని సీఎస్‌ను ఆయన ప్రశ్నించారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version