అమరావతిలో జగన్ కు మరో ఎదురు దెబ్బ!

రాజధానిని అమరావతి నుండి తరలించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించినప్పటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మొదటగా విజిలెన్సు, ఎసిబి కార్యాలయాలను కర్నూల్ కు తరలించడంపై స్టే ఇచ్చిన హై కోర్ట్, గత వారం ఆ జిఓ చెల్లదని తీర్పు ఇచ్చింది. మూడు నెలలకు పైగా నిరసనలు చేపట్టిన అమరావతి ప్రాంత గ్రామాలకు చెందిన రైతులు, ముఖ్యంగా మహిళలను పోలీస్ బలంతో తొలగించాలని చేసిన ప్రయత్నానికి సహితం హై కోర్ట్ […]

Written By: Neelambaram, Updated On : March 23, 2020 1:00 pm
Follow us on

రాజధానిని అమరావతి నుండి తరలించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించినప్పటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మొదటగా విజిలెన్సు, ఎసిబి కార్యాలయాలను కర్నూల్ కు తరలించడంపై స్టే ఇచ్చిన హై కోర్ట్, గత వారం ఆ జిఓ చెల్లదని తీర్పు ఇచ్చింది.

మూడు నెలలకు పైగా నిరసనలు చేపట్టిన అమరావతి ప్రాంత గ్రామాలకు చెందిన రైతులు, ముఖ్యంగా మహిళలను పోలీస్ బలంతో తొలగించాలని చేసిన ప్రయత్నానికి సహితం హై కోర్ట్ నుండి ఆకాంక్షలు ఎదురయ్యాయి.

తాజాగా, రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అందచేసిన భూములలో కొన్నింటిని ఇతర ప్రాంతాలకు చెందిన పేద ప్రజలకు పెట్టలుగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి సహితం హై కోర్ట్ నుండి ప్రతిఘటన ఎదురైనది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే హైకోర్టు ఇచ్చింది. గుంటూరు, విజయవాడ, దుగ్గిరాల, పెదకాకాని ప్రాంతాలకు చెందిన…51 వేలమందికి 1,215 ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

రాజధాని గ్రామాల్లోని పేదలకు మాత్రమే భూములివ్వాలని సీఆర్డీఏ చట్టంలో ఉందని రైతుల తరపు న్యాయవాదులు వాదించారు. దానితో ఇప్పుడు ఈ భూములను పంపిణి చేసే ప్రభుత్వ కార్యక్రమానికి బ్రేక్ పడిన్నట్లు అయింది.