Raghurama Krishnam Raju: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకు నోటీసులు వెళ్లాయి. రెండు రోజుల క్రితం మద్యం పాలసీపై ఆయన చూపిన ఆధారాలు ఇవ్వాలని కోరాయి. దీంతో రఘురామ మాట్లాడిన మాటలు నిజమా? కాదా? అనే విషయాలు నిరూపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు రఘురామ మాట్లాడిన మాటల్లో వాస్తవమెంత? ఆరోపణలేనా? అనే దానిపై అధికారులు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో రఘురామ ముందుంటున్నారు.దీంతో ఆయన పదేపదే ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. గతంలోనే ఆయనను అరెస్టు చేసిన ప్రభుత్వం ఈసారి ఆధారాలు చూపించాలని అడగడం ఆసక్తి నెలకొంది.

రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులైపారుతోంది. ఇందులో విషపదార్థాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని చూపించారు.దీంతో సదరు శాఖ వాటిని తమకుఇవ్వాలని కోరింది. దీంతో వాటిని నిజమైనవా? లేక వట్టివా అనే దానిపై వారు కూడా పరీక్షించుకోనున్నారు. దీంతో రఘురామ ఆరోపణల్లో ఏది నిజం? ఏది అబద్ధమనే వాటిని నిరూపించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మద్యం పాలసీపై రఘురామ దగ్గర ఉన్న ఆధారాలు పంపాలని కోరింది.
హైదరాబాద్ లోని ఎస్ జీఎస్ కంపెనీలో మద్యం పరీక్షలు చేయగా అందులో కల్తీ మద్యం ఆనవాళ్లుఉన్నాయని తేలిందని చెప్పడం గమనార్హం. దీనిపై ప్రధానికి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీ వెల్లడించారు. దీంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై దానికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని అడిగింది. దీంతో ఇక రఘురామ మాట్లాడిన మాటలకు జరిపిన పరీక్షలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: జగన్ ఫార్ములాను వాడేస్తున్న చంద్రబాబు.. ఏపీ సీఎం ఇరకాటంలో పడుతారా..?
రఘురామ మాట్లాడిన దాంట్లో నిజం లేకపోతే కేసులు పెట్టే వరకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక మీదట అలా కుదరదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రఘురామ ఏం మాట్లాడినా దానిపై వివరాలు సేకరించేందుకు అధికార యంత్రాంగం కూడా రెడీగా ఉంటోంది. దీంతో ప్రస్తుతం రఘురామ ఏం మాట్లాడాలన్నా పక్కా ఆధారాలుండేలా చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఏపీలో కొద్ది రోజులుగా ప్రభుత్వానికి రఘురామకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొన్ని వందల ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వంపై విరుచుకు పడటం ఆయనకు మామూలుగా అయిపోయింది. దీంతో ఇకపై అలా కుదరదని తెలుస్తోంది. దేని గురించి మాట్లాడినా దాని ఆధారాలు పక్కాగా ఉంచుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నారు.
Also Read: ఏపీకి రాజధాని అదే అంట.. జగన్ కు షాక్ ఇచ్చిన కేంద్రం..!
[…] Also Read: రఘురామ ఇకపై ఏం మాట్లాడాలన్నా ఆధార… […]