India Corona Cases: దేశంలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య తగ్గుతున్నా మరణాల సంఖ్య మాత్రం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. పాజిటివిటీ రేటు తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో రెండు లక్షలకు దిగువనే కేసులు నమోదు కావడం సంతోషం కలిగిస్తోంది. గతంతో పోల్చితే కేసుల సంఖ్యలో భారీ మార్పులు వస్తున్నాయి. కానీ ఇంకా ముప్పు మాత్రం తొలగిపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. మూడో దశ ఇంకా పోలేదని చెబుతున్నారు.దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.

ఇప్పటికే పాఠశాలలకు వారం రోజులు సెలవులు ప్రకటించారు. 15-17 సంవత్సరాల వారికి టీకాలు కూడా వేశారు. దీంతో కరోనా ముప్పు అంత తీవ్రంగా లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ను తుద ముట్టించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కొంత భయపెడుతున్నా దాన్ని కూడా త్వరలో నిర్మూలించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. దీంతో వైరస్ దాడిని సమగ్రంగా ఎదుర్కోవాలని అందరు ఆశిస్తున్నారు.
Also Read: రఘురామ ఇకపై ఏం మాట్లాడాలన్నా ఆధారాలుండాలా?
అయితే మరణాల సంఖ్య పెరగడంపైనే ఆందోళన కలుగుతోంది. గడచిన 24 గంటల్లో 1733 మరణాలు చోటుచేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. మరణాల రేటు పెరగడంతో బాధితుల్లో భయం పెరుగుతోంది. తమ ప్రాణాలకు ఎక్కడ ప్రమాదం ఉంటుందో అనే బెంగ అందరిలో పట్టుకుంది. దీంతో ప్రజల్లో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఓ పక్క ఆంక్షలు విధిస్తున్నా ఫలితాలు మాత్రం బాగానే వస్తున్నాయి.
మరోవైపు కరోనా మొదటి, రెండు డోసులు తీసుకోవడంతో వైరస్ వ్యాప్తి తగ్గినట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కువ శాతం మంది ప్రజలు డోసులు తీసుకుని వైరస్ ను ఎదుర్కొనే విధంగా తయారైనట్లు చెబుతున్నారు. దీంతో కరోనా వైరస్ ను తుదముట్టించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల్లో కూడా చైతన్యం రావడంతో అందరు మాస్కులు ధరిస్తున్నారు. విధిగా భౌతిక దూరం పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్లు తెలుస్తోంది.
Also Read: కేంద్ర బడ్జెట్ పై జగన్ ‘కుస్తీ’ పాట్లు..!