https://oktelugu.com/

కరోనా వేళ ‘క్యాష్’ చేసుకోవడం ఇలా.!

కరోనా వేళ అందరి దుకాణాలు మూతపడ్డాయి. అందరూ రోడ్డున పడ్డారు. ఉద్యోగ ఉపాధి కోల్పోయి దిక్కులు చూస్తున్నారు. కానీ ఈ కరోనా కల్లోలంలోనూ ఉపాధిని వెతుక్కోవచ్చని మీకు తెలుసా? కాస్త సృజనాత్మకథ ఉంటే చాలు.. ఆదాయం అదే వస్తుందని నిరూపించాడు తెలంగాణలోని మారుమూల బాన్సువాడ గిరిజన జనాలుండే చోట ఓ హోటల్ నిర్వాహకుడు. ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతూ సంపాదనను పెంచుకుంటున్నాడు. Also Read: ‘గాల్లో’ ఎగరాలంటే మాస్కు ఉండాల్సిందే..! ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా.. ఇప్పుడు మన […]

Written By:
  • NARESH
  • , Updated On : August 28, 2020 / 08:19 PM IST
    Follow us on


    కరోనా వేళ అందరి దుకాణాలు మూతపడ్డాయి. అందరూ రోడ్డున పడ్డారు. ఉద్యోగ ఉపాధి కోల్పోయి దిక్కులు చూస్తున్నారు. కానీ ఈ కరోనా కల్లోలంలోనూ ఉపాధిని వెతుక్కోవచ్చని మీకు తెలుసా? కాస్త సృజనాత్మకథ ఉంటే చాలు.. ఆదాయం అదే వస్తుందని నిరూపించాడు తెలంగాణలోని మారుమూల బాన్సువాడ గిరిజన జనాలుండే చోట ఓ హోటల్ నిర్వాహకుడు. ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతూ సంపాదనను పెంచుకుంటున్నాడు.

    Also Read: ‘గాల్లో’ ఎగరాలంటే మాస్కు ఉండాల్సిందే..!

    ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా.. ఇప్పుడు మన గ్రామాలకు కూడా పాకింది. ఫిబ్రవరిలో మొదలైన భయం ఇంకా ప్రజల్లో కనిపిస్తూనే ఉంది. కంటికి కనిపించని వైరస్‌ అందరినీ హైరానా పెడుతోంది. బయటకివెళ్తే ఎవరి నుంచి ఎలా వస్తుందో తెలియకుండా ఉంది. అందుకే ప్రజలు మరీ ముఖ్యమైన పని పడితే కానీ ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం లేదు. దీంతో రెస్టారెంట్లు, హోటల్స్‌, ఫాస్ట్ ఫుడ్‌ సెంటర్స్‌ అన్నీ మూతపడ్డాయి. దీనికితోడు ఇమ్యునిటీ పవర్‌‌ పెంచుకుంటే కరోనా దక్కరకు రాదంటూ డాక్టర్లు చెబుతుండడంతో జనాలు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. ఏం తింటే ఇమ్యునిటీ పవర్‌‌ పెరుగుతుందో ప్రస్తుతం వాటినే తింటున్నారు. దీన్ని పలువురు వ్యాపారులు క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

    ఇప్పటికే మార్కెట్లోకి కరోనా టీ అంటూ ఆయుర్వేద మూలికాలతో తయారు చేసే టీకి గిరాకీ పెరిగింది. ఇప్పుడీ టీస్టాల్‌ నిర్వాహకుల తెలంగాణలో జోరుగా వ్యాపారం చేస్తున్నారు… తాజాగా ఆయుర్వేదిక్‌ చికెన్‌ ధమ్‌ బిర్యానీ అంటూ ఓ హోటల్‌ నిర్వాహకులు వెరైటీ ఆలోచన చేశారు. ఈ బిర్యానీ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. మొన్నటి దాకా హోటల్‌ బిజినెస్‌ కుదేలు కావడంతో వీరు కొత్త ట్రెండ్‌ సెట్‌ చేశారు. ఈ బిజినెస్‌ ప్రస్తుతం మార్కెట్లో హల్‌చల్‌గా నడుస్తోంది. ఆలోచన ఉంటే ఎందులోనైనా సక్సెస్‌ కావచ్చని నిరూపిస్తున్నారు.

    Also Read: అసమ్మతి నేతలపై సోనియా వేటు వేస్తారా?

    కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన ఐస్‌ లాండ్‌ హోటల్‌ నిర్వాహకులు థింక్‌ డిఫరెంట్‌లా ఆలోచించాడు. బిర్యానీలో దాల్చిన చెక్క, సొంఠి, మిరియాలు, లవంగాలు, ఉసిరి, తులసి పౌడర్‌‌తో పాటు వివిధ రకాల మూలికలు వేస్తూ తయారుచేస్తున్నారు. ఈ బిర్యానీని భోజన ప్రియులు కూడా లొట్టలేసుకుంటూ తింటున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి మరీ పార్శిల్‌ తీసుకెళ్తున్నారు. నోరూరించే ఈ ధమ్‌ బిర్యానీ ధర కూడా కేవలం రూ.140 మాత్రమేనని నిర్వాహకులు చెబుతున్నారు.

    ఇలా అందరి హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడ్డ వేళ ఈయన హోటల్ ముందు మాత్రం జనాలు క్యూలు కట్టి మరీ ఆయుర్వేద బిర్యానీ తీసుకెళుతుండడం విశేషంగా మారింది. అందుకే అంటారు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అనీ..