NDA Vs Mahaghatbandhan: బీహార్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో మరింత వేగాన్ని పెంచాయి. ఓటర్లను ఆకర్షించడానికి.. వారి మనసు దోచుకోవడానికి హామీల వర్షం కురిపిస్తున్నాయి. శుక్రవారం బీహార్ లోని అధికార ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించింది.
Also Read: వాళ్లంతా సర్వనాశనం అయిపోతారు అంటూ శాపనార్ధాలు పెట్టిన మంచు లక్ష్మి!
ఎన్డీఏ కూటమి
ఎన్డీఏ బీహార్ వలస కార్మికులను దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో రూపొందించినట్టు కనిపిస్తోంది.
కోటి ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టిస్తామని హామీ ఇవ్వడం ఈ మేనిఫెస్టోలో ప్రధాన అంశం. పేదలకు పంచామృతం పేరుతో ఉచితరేషన్ అందించనుంది.
5 లక్షల విలువైన ఉచిత చికిత్స పేదలకు అందించనుంది. 50 లక్షల వరకు పక్కా గృహాలను నిర్మించనుంది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఆర్థిక సహాయాన్ని 6000 నుంచి 9000 వరకు పెంచనుంది.
మత్స్యకారులకు ప్రతి ఏడాది 4500 నుంచి 9000 వరకు సహాయం అందిస్తుంది. అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర చెల్లిస్తుంది.
ప్రతి జిల్లాలో ఒక ఫ్యాక్టరీని నిర్మిస్తుంది. 10 కొత్త పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తుంది.
రాష్ట్రంలో ఏడు ఎక్స్ ప్రెస్ హైవే లను నిర్మించనుంది.
దాదాపు 3600 కిలోమీటర్ల వరకు రైల్వే ట్రాక్ లను అభివృద్ధి చేస్తుంది.
కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్య అందిస్తుంది.
ఎస్సీ విద్యార్థులకు ప్రతి నెల 2000 ఉపకార వేతనం చెల్లిస్తుంది.
ఈ బీసీ కేటగిరిలో ఉన్న విద్యార్థులకు 10 లక్షల వరకు సహాయం అందిస్తుంది.
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తుంది.
స్కూల్స్ అప్ గ్రేడేషన్ కోసం 5000 కోట్లు ఖర్చు చేస్తుంది.
కోటి మంది మహిళలను లక్ పతి దీదీ లుగా మార్చనుంది.
మహాకూటమి
మహాకూటమి కూడా భారీగానే హామీలను తన మేనిఫెస్టోలో రూపొందించింది. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయనుంది.
ఐటీ పార్కులు, సెజ్ లు, డెయిరీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఐదు కొత్త ఎక్స్ప్రెస్ హైవే లను నిర్మించనుంది.
ప్రతి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తుంది. తొలి కేబినెట్ భేటీలో దీనిపైన స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుంది. 20 నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తుంది. జీవికా దీదీ లను పర్మినెంట్ చేస్తుంది. నెలకు 30,000 వరకు వేతనం చెల్లిస్తుంది.
ఇవే కాకుండా పాఠశాలల ఆధునికికీకరణ.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. మహిళా సంఘాలకు రుణాలు.. విద్యార్థులకు ఉపకార వేతనాలు.. సంక్షేమ పథకాలతో జంబో మేనిఫెస్టోను కూటమి విడుదల చేసింది.